తెలంగాణ స్టేట్ ఫుడ్ లాబరేటరీ కార్యాలయంలో 4 మొబైల్ లాబరేటరీ వాహనాలను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు..

ప్రజల ఆరోగ్య సంరక్షణ తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

హైదరాబాద్ నాచారం పారిశ్రామిక వాడలో తెలంగాణ స్టేట్ ఫుడ్ లాబరేటరీ కార్యాలయంలో 4 మొబైల్ లాబరేటరీ వాహనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ ల సంఖ్య పెంచాము.రాష్ట్రస్థాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

ఈరోజు ప్రారంభించిన మొబైల్ టెస్ట్ వాహనాలు హైదరాబాద్ నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్ జిల్లాలో బస్సు లో అందుబాటులో ఉంటాయని తెలియజేశారు.మొబైల్ వాహనాలు జిల్లా పల్లెల్లో తిరుగుతూ ఆహార కల్తీ గుర్తించడం బస్సుల ద్వారా ఆహార కల్తీ పట్ల ప్రజలకు అప్రమత్తం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

ప్రభుత్వం ఆహార కల్తీ అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ఎక్కడైనా కల్తీ జరుగుతే 04021111111 నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని తెలియజేశారు.

Advertisement
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

తాజా వార్తలు