కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా.కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు బదులిచ్చారు.
ప్రధాని ఫొటోలను రేషన్ షాపుల్లో పెట్టాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా నిర్మల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా కేంద్రానికి తెలంగాణ అందిస్తున్న పన్ను వాటా గురించి ఆయన ప్రస్తావించారు.కేంద్రంతో పాటు తెలంగాణ నిధులు వెళ్తున్న రాష్ట్రాల్లో కేసీఆర్ ఫొటోను పెట్టాలని డిమాండ్ చేశారు.
మీరలా అడిగితే.మేం ఇలా అడగకూడదా.? అని ప్రశ్నించారు.







