ఏపీలో పొత్తులపై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్( Minister Gudivada Amarnath ) కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న రెండు రోజుల్లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన( TDP Janasena ) చేరబోతున్నాయని తెలిపారు.
అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తాయని పేర్కొన్నారు.
అప్పుడు సీట్లన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) డిసైడ్ చేస్తారని తెలిపారు.జనసేన నేత నాగబాబు( Nagababu ) సీటు సహా ఎవరి సీటైనా చంద్రబాబే నిర్ణయిస్తారని వెల్లడించారు.అయితే ఎవరు ఎవరితో కలిసి వచ్చినా తమ విధానంలో మార్పు లేదని స్పష్టం చేశారు.