అనకాపల్లి జిల్లా: అనకాపల్లి నూకాంబికా దేవస్థానంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్.వికేంద్రీకరణకు అన్ని ప్రాంతాల నుంచి మద్దతు లభిస్తుంది.
వికేంద్రీకరణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలని నూకాంబికా అమ్మవారికి ప్రత్యేక పూజలు.అనకాపల్లిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం.
వికేంద్రీకరణ ద్వారా అన్ని రకాల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నారు.అమరావతి రైతుల పాదయాత్ర రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే.
అమరావతి పాదయాత్ర పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.అమరావతి రైతుల పాదయాత్ర రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, విద్వేశాలను రెచ్చగొడుతున్నారు.విద్వేషాలతో ఎటువంటి సంఘటన జరిగిన దానికి పూర్తి బాధ్యత చంద్రబాబునాయుడుదే. అమరావతి కోసం రైతుకు చేస్తున్న పాదయాత్రలో ఇటువంటి దుర్ఘటనలు సంఘటన గాని జరిగిన దానికి పూర్తి బాధ్యత చంద్రబాబుదే.ఎటువంటి విద్వేషాలు జరగకుండా చంద్రబాబునాయుడు పూర్తి బాధ్యత వహించాలి.గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై దేశ రాజకీయాలలో ప్రశంసలు అందుతున్నాయి.
దేశంలో వికేంద్రీకరణ చేయడం కొత్తమీ కాదు.కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు వికేంద్రీకరణ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
చంద్రబాబు నాయుడు నిర్మించిన అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే, ఆంధ్రప్రదేశ్ ప్రజల రాష్ట్రం కోసం కాదు.విశాఖలో జరిగిన వికేంద్రీకరణ రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను త్వరలోనే ప్రకటిస్తాం.
వచ్చే విజయ దశమికి విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేపడతారు.