కాంగ్రెస్, బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తీవ్రంగా మండిపడ్డారు.కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు.
కాంగ్రెస్ – బీజేపీ నేతల బోగస్ మాటలను రైతులు నమ్మొద్దని తెలిపారు.కాంగ్రెస్ -బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు.
రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదని ప్రశ్నించారు.దేశమంతా తెలంగాణ రాష్ట్రంలోని పాలన కోరుకుంటే రేవంత్ రెడ్డి ఛత్తీస్ గఢ్ తో పోల్చడం సరికాదని పేర్కొన్నారు.