మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు అమారావతి రాజధాని అంటున్నారని అదే జరిగితే మాకు విశాఖ రాజధాని ఇచ్చేయండి మేము ఒక చిన్న రాష్ట్రం చేసుకుంటామని అన్నారు.
ఉత్తరాంద్ర పర్యటనలో చంద్రబాబు అమరావతి రాజధాని అని చెప్పడం మన చేత్తో మన కళ్ళు పొడవటమే అన్నారు.వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమం చూడలేక చంద్రబాబు బాదుడే బాదుడు అని తిరుగుతున్నారన్నారు.
జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని విమర్శించారు.జనాల్లో ఇంకా ఎక్కడో సైకిల్ భావన ఉందని సైకిల్ ని నమ్మి మోసపోవద్దు అని సూచించారు.
అధికారం కోసం చంద్రబాబు ఏదయినా చేస్తారని ఆరోపించారు…
.