ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు…నందమూరి కుటుంబం నుంచి టిడిపి పార్టీని నారావారి కుటుంబంగా మార్చుకున్నప్పుడు ఈ మనవళ్లు ఎక్కడ దాక్కున్నారు….మీ తాతని (ntr) నీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడికి ఎందుకు మీరు చమ్మచక్కలు కొడుతున్నారు….
అదే జగన్మోహన్ రెడ్డి గారు మీ తాత గారి పేరు అయినా ఎన్టీఆర్ జిల్లాగా పెడితే ఆరోజు మాట్లాడినటువంటి మీరు ఈరోజు మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది….- టీడీపీ నేతలపై అనిల్ ఫైర్‌అన్న క్యాంటీన్ అంటే ఎవరు చంద్రన్న.
పప్పన్న.?అన్నా క్యాంటీన్లకు ఎన్టీఆర్ గారి పేరు పెట్టకుండా అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు…అసలు మీకు ఎన్టీ రామారావు గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలందరికి కార్పొరేట్ వైద్యం అందాలన్న ఆలోచన చేసిన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంచి ఆలోచన చేశారన్నారు.దీనిని టీడీపీ ఇంత రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు.