ప్రజాస్వామ్యంలో దాడులు మంచివి కావని మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) అన్నారు.తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదని తెలిపారు.
మిర్చి యార్డులో ఎటువంటి వర్గపోరు లేదని మంత్రి అంబటి పేర్కొన్నారు.చిన్న చిన్న అభిప్రాయభేదాలుంటే సర్దుకుంటాయన్నారు.

అలాగే సీఎం జగన్( CM YS Jagan ) నాయకత్వంలో అందరం కలిసి పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.అనంతరం వైఎస్ షర్మిల( YS Sharmila ) వ్యవహారంపై రియాక్ట్ అయిన మంత్రి అంబటి రాంబాబు ఆమె ఓవరాక్షన్ చేస్తోందంటూ ధ్వజమెత్తారు.