మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా

మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ నివాసం వద్ద అర్ధరాత్రి సమయంలో హైడ్రామా నెలకొంది.

కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఏం లభించలేదని తెలుస్తోంది.ఐటీ అధికారుల సోదాలకు గోయల్ వారెంట్ కోరటంతో వారు వెనుదిరిగారని సమాచారం.

అయితే మధ్యాహ్న సమయంలో ఫిర్యాదు చేస్తే రాత్రి సమయానికి అధికారులు రావడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే గోయల్ నివాసం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

అటు పోలీసులు కూడా భారీగా మోహరించడంతో గోయల్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.మరోవైపు టాస్క్ ఫోర్స్ తనిఖీలపై పలు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Advertisement
వామ్మో.. ఇదేందయ్యా ఇంతుంది.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదేనట(వీడియో)

తాజా వార్తలు