యూకేలో భారత సంతతి విద్యార్ధి దారుణ హత్య

ఇంగ్లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.మిడ్‌ల్యాండ్స్‌ నాటింగ్‌హామ్‌లో ఒక పబ్‌ సమీపంలో జరిగిన దాడిలో భారత సంతతి విద్యార్ధి మరణించాడు.

నాటింగ్‌హామ్‌షైర్ పోలీసుల కథనం ప్రకారం.నాటింగ్‌హామ్ ట్రెంట్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న 20 ఏళ్ల అర్జున్ సింగ్‌ శనివారం స్థానిక లాంగ్‌ రో లోని స్లగ్ అండ్ లెటుస్ పబ్‌కు వెళ్లాడు.

ఇక్కడ అతనిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.తీవ్రగాయాలపాలైన అర్జున్‌ను క్వీన్స్ మెడికల్ సెంటర్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అతను మరణించాడు.

కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితులను గుర్తిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి ఓ 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

కేసు విచారణకు సంబంధించి తమ డిటెక్టివ్‌ల బృందం నిర్విరామంగా పనిచేస్తుందన్నారు నాటింగ్‌హామ్‌షైర్ పోలీస్ డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ రిచర్డ్ మాంక్.

అర్జున్ కుటుంబ వివరాలను గోప్యంగా ఉంచుతామని.అలాగే పలువురు సాక్షులను విచారించి, వీడియో ఫుటేజ్‌ను పూర్తిగా విశ్లేషిస్తామని మాంక్ తెలిపారు.మరోవైపు అర్జున్ మరణంతో నాటింగ్‌హామ్ ట్రెంట్ వర్సిటీ దిగ్భ్రాంతికి గురైంది.

ఈ కష్ట సమయంలో తాము అర్జున్ కుటుంబసభ్యులకు అండగా ఉంటామని, కేసు దర్యాప్తులో పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వర్సిటీ ప్రతినిధి తెలిపారు.

నిజ్జర్ హత్య కేసు : ఆ నలుగురు భారతీయులు కస్టడీలోనే, మళ్లీ నోరు పారేసుకున్న కెనడా
Advertisement

తాజా వార్తలు