మైక్రోసాఫ్ట్( MicroSoft ) ఆధ్వర్యంలోని విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో( Windows 11 ) కొత్తగా కొన్ని రకాల ఫీచర్లను తీసుకు వస్తున్నట్లు కంపెనీ తాజాగా ఓ ప్రకటన చేసింది.విండోస్ 11లో పెయింట్, ఫొటోలు వంటి అప్లికేషన్‌లకు కొత్తగా కృత్రిమ మేధస్సు (AI) ఫీచర్‌లను యాడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
దీని సహాయంతో ఇకమీదట ఫొటోలను కొత్త ఆప్షన్లతో ఎడిట్ చేసుకోవచ్చన్నమాట.అవును, ఇపుడు పెయింట్ యాప్‌లో సరికొత్త టూల్స్‌ను తీసుకొస్తున్నారు.
ఫొటోలో వస్తువులను, మనుషులను సులభంగా గుర్తించడానికి స్నిప్పింగ్ టూల్‌లో ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR) టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

విషయం ఏమిటంటే, మీరు క్యాప్చర్ చేసిన ఫొటోలని కావలసిన ఏరియాను ఎంచుకుని దాన్ని ఇతర ఏరియాలలో కాపీ పేస్ట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుందని విండోస్ సెంట్రల్ నివేదిక తాజాగా పేర్కొంది.పెయింట్ యాప్ కోసం, వినియోగదారులు అందించిన ప్రమాణాల ఆధారంగా కాన్వాస్‌ను రూపొందించే ఫీచర్‌ను కంపెనీ విడుదల చేయాలని యోచిస్తోంది.కాబట్టి ఈ విషయం వినియోగదారులను ఆనందించదగ్గ విషయమే.

మరీ ముఖ్యంగా ఎవరైతే యూట్యూబ్, రీల్స్ క్రియేటర్లు వుంటారో వారికి ఈ ఫీచర్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడగలవు.ఇపుడు చాలామంది క్రియేటర్స్ ఆన్లైన్ టూల్స్( Online Tools ) మీద ఆధారపడుతున్న పరిస్థితి వుంది.కానీ ఈ అప్డేట్ వచ్చాక అలాంటి పరిస్థితి ఉండదు.డైరెక్ట్ గా విండోస్ లోనే మీకు నచ్చిన విధంగా ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు.ఇకపోతే, ఇంటర్నెట్ ప్రపంచంలో ఏఐ ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో తెలియంది కాదు.దాని ప్రత్యేకతను తెలుసుకొని వివిధ కంపెనీలు ప్రస్తుతం దాని వినియోగాన్ని పెంచుతున్నారు.
వివిధ రంగాల్లో ప్రస్తుతం ఏఐ తన సత్తాని చాటుతోందని చెప్పుకోవచ్చు.







