మైక్రోసాఫ్ట్( Microsoft ) టీమ్స్ యూజర్లారా! మీరు విన్నది నిజమే.మైక్రోసాఫ్ట్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు ఉపయోగకరమైన ఫీచర్లను పరిచయం చేస్తూ వారి మనసుని చూరగొంటోంది.
ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ యూజర్లకు ఒక అద్భుతమైన ఫీచర్ పరిచయం చేయడానికి సన్నద్ధమైంది.ఆ ఫీచర్‌తో వీడియో కాల్స్‌లో యూజర్లు తమ ఫేస్‌కి బదులుగా “త్రీడీ అవతార్స్”( 3D Avatars )ని ఉపయోగించవచ్చన్నమాట.
తాజా సమాచారం ప్రకారం, 2023, మే నుంచి మైక్రోసాఫ్ట్ టీమ్స్ ప్లాట్‌ఫామ్ ఈ 3D అవతార్‌లకు సపోర్ట్ చేయనుంది.
![]()
అవును, ఇపుడు 3D అవతార్స్ మీ వాయిస్‌కి వర్చువల్ క్లోన్‌లుగా పని చేస్తాయన్నమాట.దీని అర్థం మీరు వీడియో కాల్‌ల సమయంలో మీ కెమెరాకు బదులుగా అవతార్‌ని వాడుకోవచ్చు.సాధారణంగా యూజర్లు మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను చాట్ చేయడానికి, వీడియో కాల్ చేయడానికి, రియల్-టైమ్‌లో ప్రాజెక్ట్‌లలో కలిసి పని చేయడానికి వినియోగిస్తారు.
కాగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ప్లాన్ అప్‌డేట్‌లో 3D అవతార్స్ పనితీరు గురించి మెన్షన్ చేయడం విశేషం.ముందుగా చెప్పుకున్నట్లు మే నెల నుంచి మైక్రోసాఫ్ట్ టీమ్స్ కస్టమైజబుల్ 3D అవతార్స్‌ను యూజర్లకు ఆఫర్ చేస్తుందన్నమాట.
![]()
మీ వీడియో కాల్స్‌లో ఫేస్ చూపించడం ఇష్టం లేకపోతే ఈ ఫీచర్ మీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది.మైక్రోసాఫ్ట్ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఫీచర్ మీటింగ్‌ల సమయంలో యూజర్లు తమను తాము రిప్రజెంట్ చేసుకోవడానికి మరిన్ని ఆప్షన్స్ అందుబాటులోకి తెస్తుంది.గతంలో మైక్రోసాఫ్ట్ మెష్ ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్ అయినటువంటి “కేటీ కెల్లీ”( Katie Kelly ) మాట్లాడుతూ… అవతార్లు వాయిస్ క్యూస్ ప్రకారం యానిమేట్ అవుతాయని, ఫలితంగా అవి లైవ్లీ అండ్ రియల్ ఫీల్‌ను అవతలి వ్యక్తికి కలిగిస్తాయని వివరించిన సంగతి మీకు తెలిసినదే.వాయిస్ ద్వారానే ఇవి యానిమేట్ అవుతాయి కాబట్టి కెమెరా ముందు కూర్చొని ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.






