బేబీతో డిప్లొమా సర్టిఫికెట్ అందుకున్న మిచిగాన్ విద్యార్థిని.. క్యూట్ పిక్ వైరల్..

డిసెంబర్‌లో ఫెర్రిస్ స్టేట్ యూనివర్శిటీకి( Ferris State University ) చెందిన విద్యార్థిని గ్రేస్ స్జిమ్‌చాక్‌కి రెండు గుడ్ న్యూస్‌లు అందాయి.ఈ మంత్ ఆమె ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందడమే కాకుండా, ఒక పడంటి ఆడబిడ్డకు తల్లి అయింది.

 Michigan Student Who Received Diploma Certificate With 10-months-old Baby Cute P-TeluguStop.com

గ్రేస్ తన గ్రాడ్యుయేషన్ వేడుకకు డిసెంబర్ 15న హాజరుకావాలని అనుకుంది, ఆపై డిసెంబర్ 18న షెడ్యూల్ చేసిన సమయానికి సిజేరియన్‌ చేయించుకోవాలని భావించింది.అయితే, ఆమె కుమార్తె అన్నాబెల్లె డెలివరీ డేట్‌కి ముందే అంటే 12 రోజుల ముందుగానే ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

అయితే పాప పుట్టినా సరే గ్రేస్ గ్రాడ్యుయేషన్ సెరిమోనీకి హాజరు కావాలనే తన ప్లాన్ చేంజ్ చేయలేదు.ఆమె గ్రాడ్యుయేషన్ గౌను ధరించి, తన గౌన్‌లో కుమార్తెను ఉంచుకుని వేడుకల్లో పాల్గొనది.ఈ న్యూ మదర్, డాటర్‌కు సంబంధించిన క్యూట్ ఫొటోను ఫెర్రిస్ స్టేట్ యూనివర్శిటీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసింది.అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.”నేను ఈ డిగ్రీ కోసం కష్టపడి పనిచేశా.నా తరగతిలోని మిగిలిన వారితో కలిసి నడవాలని నేను నిశ్చయించుకున్నా.కాబట్టి నేను నా కూతురిని నాతో గ్రాడ్యుయేషన్‌కు తీసుకువచ్చాను.” అని గ్రేస్ డిప్లొమా అందుకున్నాక చెప్పింది.

ఆమె భర్త కాలేబ్, ఆమె కుటుంబం ఆమెకు మద్దతు ఇచ్చారు.గ్రేస్ హానర్స్‌ డిగ్రీతో పట్టభద్రురాలయింది.ఆమె తన 10-రోజుల బిడ్డను పట్టుకొని తన డిప్లొమా పొందింది, ఆ బిడ్డను ప్రత్యేకంగా యూనివర్సిటీ మెన్షన్ కూడా చేసింది.యూనివర్శిటీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో గ్రేస్, ఆమె కుమార్తె ఫోటోను పంచుకుంటూ ఆమె సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ, తల్లిగా ఆమెను కంగ్రాట్యులేట్ చేసింది.

రీసెంట్‌గా అప్‌లోడ్ చేసిన ఈ పోస్ట్‌కి 1,300 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube