బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా టూర్ లో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లోను ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పందిస్తూ, ఆస్ట్రేలియా టీం ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా ఆడడం వల్లనే ఘోరంగా ఓడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఏ క్రికెట్ జట్టు అయిన ఇతర దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడితేనే, ఆ గ్రౌండ్ లోని పరిస్థితులు అలవాటు అవుతాయని, అప్పుడే ఆటలో విజయం సాధించవచ్చు అని తెలిపాడు.లేకపోతే ఇలాగే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
ఇక రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఆస్ట్రేలియా జట్టు ఆడిన తీరులోని తప్పిదాలను ఎత్తు చూపిస్తూ. నాగపూర్ వేదికగా జరిగిన టెస్టులో 132 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయి, ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో ఘోర ఓటమిని సొంతం చేసుకుంది అని పేర్కొన్నాడు.
ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా స్వీప్ షాట్లు ఆడే ప్రయత్నం చేసి, స్ట్రైట్ బ్యాటింగ్ ఆడనందు వల్లనే రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది.ఇందులో ఆశ్చర్య పోవాల్సినది ఏమీ లేదు.
స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవాలంటే రివర్స్ స్వీప్ షాట్లు ఆడడం సరికాదని, తాను కూడా గతంలో ఇలానే బ్యాటింగ్ చేశానని పేర్కొన్నాడు.

బ్యాటింగ్ ఆడే విధానం టీం ఇండియాను చూసి నేర్చుకోవాలని, ఎలాంటి పరిస్థితులలో ఏ విధంగా ఆడాలో ఒక్క టీమిండియా బ్యాటింగ్ చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది.కానీ మనం ప్రత్యర్థుల బ్యాటింగ్ తీరు చూడడానికి ఇష్టపడం.ఇక రెండో ఇన్నింగ్స్ లో కనీసం 200 పరుగులైన ఆస్ట్రేలియా చేసి ఉంటే గెలిచే అవకాశం ఉండేది.
ఆ టెస్ట్ మ్యాచ్ లలో కేవలం 113 పరుగులకే ఆల్ అవుట్ అవ్వడం ఘోర తప్పిదం అని స్పష్టంగా తెలుస్తుంది.

వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే కనీసం తదుపరి రెండు టెస్ట్ మ్యాచ్ లలో గెలిచే అవకాశాలు ఉండవచ్చు.ఇటువంటి పరిస్థితులలో ఆటతీరులో మార్పు తప్పనిసరి.పది రోజుల ముందే భారత్ కు వచ్చిన ఆస్ట్రేలియా కనీసం ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు.
భారత స్పిన్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక ఓటమిపాలైంది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.