భారతదేశంలో పండించే ప్రధాన పంటలలో ముఖ్యమైన పంట వరి.ఈ పంటకు ఎక్కువగా నష్టం కలిగించే తెగులలో ముఖ్యంగా అగ్గి తెగులు అని చెప్పుకోవచ్చు.
వైరక్యూలేరియా గ్రిజీయా అనే శిలీంద్రం ద్వారా ఈ అగ్గి తెగులు పంటకు సోకుతుంది.ఏ మొక్కలో అయితే అంచులు నలుపు లేదా ముదురు గోధుమ రంగు కలిగి ఉండి మధ్యభాగంలో బూడిద లేదా తెలుపు రంగు ఉంటే వాటిని అగ్గి తెగులు అని నిర్ధారించుకోవాలి.
ఇవి చెట్టు పై వరకు వ్యాపించి ఆకు మొత్తం పూర్తిగా ఎండిపోయేలా చేస్తాయి.పైగా వరి గింజలు తాలుగా మారి, మిగిలిన గింజలు కూడా పిండి కావడం లేదా నూకలుగా అవుతాయి.

అసలు అగ్గి తెగులు ఎందుకు వస్తాయి అంటే ఎక్కువగా నత్రజని వాడడం, గాలిలో తేమ శాతం 90 కంటే ఎక్కువగా ఉండడం, వాతావరణం లో ఎక్కువగా మబ్బులు లేదా జల్లులు ఏర్పడడం, ఎక్కువ రోజులు మంచు కురవడం, పొలంలో కానీ గట్టులపై గాని కలుపు మొక్కలు విపరీతంగా ఉండడం, ఇక రాత్రిపూట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఈ అగ్గి తెగులు రావడం జరుగుతుంది.

మరి ఈ అగ్గి తెగులను నివారించకుంటే చేతికి వచ్చే పంట పూర్తిగా నష్టపోవాల్సిందే.ముందుగా మేలు రకం విత్తనాలను తీసుకొని విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి.వరి పైరుకు ఏమైనా తెగులు వచ్చిన లక్షణాలు కనిపించినట్లయితే ఆలస్యం చేయకుండా టై సెక్షజోల్ 0.6 గ్రాములు లేదంటే ఐసోప్రోధాయేలెన్ 1.5 మిల్లీలీటర్లు నీటిలో కలుపుకొని వాతావరణ పరిస్థితులను బట్టి 12 నుండి 15 రోజులు మధ్యలో పిచికారి చేస్తూ ఉండాలి.రెండు లేదా మూడుసార్లు పిచికారి చేయడం వల్ల అగ్గి తెగులు పూర్తిగా తొలగిపోవడం గమనించవచ్చు.వరి పంటకు అగ్గి తెగులు సోకకుండా చర్యలు తీసుకుంటే నాణ్యమైన పంట పొందవచ్చు.







