మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో అగ్ర డైరెక్టర్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.మావెరిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ తో చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించాడు.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15‘.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
శంకర్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తాయో అందరికి తెలుసు.అందుకే ఈ సినిమా ఎలాంటి అప్డేట్ లేకపోయినా దీనిపై మంచి అంచనాలను పెంచుకున్నారు.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుపు కుంటుంది.ఇక చరణ్ ఈ సినిమా తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.

ఇప్పటికే రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా RC16 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది.మరి తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ బయటకు వచ్చింది.ప్రెజెంట్ రామ్ చరణ్ చేస్తున్న శంకర్ సినిమా మార్చి నాటికీ పూర్తి అవుతుంది.ఇక ఇది పూర్తి కాగానే చరణ్ నెక్స్ట్ సినిమా కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమా విషయంలో ఎగ్జైటెడ్ గా ఉన్నానని బుచ్చిబాబుని త్వరలోనే మీట్ అవుదాం అంటూ పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారింది.ఈ క్రమంలోనే తాజాగా ఒక బజ్ వినిపిస్తుంది.ఈ సినిమా ఈ ఏడాది చివరిలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని.
నవంబర్ లేదా డిసెంబర్ నుండి స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారని టాక్.చూడాలి మరి ఈ భారీ సినిమా డీటెయిల్స్ ఎప్పుడు అధికారికంగా బయటకు వస్తాయో.







