సోయాబీన్ పంటకు( soybean crop ) అధిక నష్టం కలిగించే లూపర్ పురుగులు( Looper worms ) ముదురు గోధుమ రంగులో ఉంటాయి.ఈ పురుగుల మధ్య భాగంలో వెండి రంగు మచ్చలు ఉంటాయి.
ఇవి సోయాబీన్ మొక్క ఆకులను ఆశించి రంధ్రాలు చేస్తూ తినేస్తాయి.పెద్దపురుగులు అయితే మొత్తం ఆకును పూర్తిగా తినేస్తాయి.
సోయాబీన్ మొక్కకు ఉండే ఆకులు అన్నీ తినేశాక చివరకు సోయాబీన్ కాయలను కూడా తినడం ప్రారంభించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.కాబట్టి ఈ పురుగులను పంటను ఆశించకుండా ముందుగానే సంరక్షణ చర్యలు తీసుకోవాలి.
తెగులు నిరోధక, ఆరోగ్యమైన విత్తనాలను( Pest resistant, healthy seeds ) మాత్రమే ఎంపిక చేసుకోవాలి.ఈ విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలి.త్వరగా పక్వానికి వచ్చే విత్తన రకాలను ఎంచుకొని తొందరగా పంట వేసుకోవాలి.మొక్కల యొక్క ఆకుల కింద భాగాన్ని గమనిస్తూ, ఈ పురుగుల ఉనికిని గుర్తించాలి.తర్వాత ఈ పురుగులు సోకిన మొక్కను పంటనుండి వేరు చేయాలి.ఆ ప్రాంతంలో ఈ పురుగులకు సంబంధించిన లార్వా లాంటి అవశేషాలు ఏమైనా ఉంటే కాల్చి నాశనం చేయాలి.
పొలంలో అక్కడక్కడ ఈ పురుగులను తినే పక్షుల కోసం గుళ్ళు లేదా స్థావరాలు ఏర్పాటు చేయాలి.
పంట పొలంలో ఎప్పటికప్పుడు కలుపును తీసేస్తూ ఉండాలి.క్రమం తప్పకుండా నీటి తడులు అందించాలి.ముఖ్యంగా పంట పొలంలో మొక్కలకు సూర్యరశ్మి, గాలి ( Sunlight, wind )బాగా తగిలే విధంగా దూరంగా నాటు కోవాలి.
ఈ పురుగులను తినే పరాన్న జీవులను పొలంలో వదలాలి.కందిరీగలు ఈ పురుగులకు శత్రువులు.కాబట్టి లూపర్ లార్వను పూర్తిగా తినేస్తాయి.లూపల్ లార్వాను తినే కీటకాలు కాంపోలిటిస్ సోనోరెన్సిన్, కెసినారియా ఫ్లూయ్ సీఏ, కోటేసియా గ్రెనాడేన్సిస్ మరియు పరాన్న జీవి ఈగలతో ఈ పురుగులను అరికట్టవచ్చు.
రసాయన పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే సెల్క్రోన్ 50%EC లేదా కొరజెన్, వెస్టికోర్ లాంటి పిచికారి మందులను ఉపయోగించి ఈ పురుగులను వ్యాప్తి అధికారితే అధిక దిగుబడి పొందవచ్చు.