వరి పంటను ఆశించే కాటుక తెగులను అరికట్టే పధ్ధతులు..!

కాటుక తెగులు విల్లోసిక్లవ వైరెన్స్( Villociclava virens ) అనే ఫంగస్ వల్ల ఏర్పడుతుంది.వరి మొక్క పుష్పించే దశలో ఈ కాటుక తెగులను మొక్కపై గమనించవచ్చు.

 Methods To Prevent The Biting Pest Of The Rice Crop , Rice Crop, Villociclava V-TeluguStop.com

భూమిలో నత్రజని ( Nitrogen )శాతం అధికంగా ఉన్న, వాతావరణం లో తేమ శాతం అధికంగా ఉన్న, తరచుగా వర్షం పడుతూ ఉన్న ఈ కాటుక తెగులు పంటను ఆశించే అవకాశం ఉంది.వరి గింజల పై నారింజ రంగు మచ్చలు ఏర్పడి, తర్వాత ఎండిపోయి పచ్చని నల్ల రంగులోకి మారుతాయి.

దీంతో ధాన్యం బరువు తగ్గుతుంది.కంకులు ఏర్పడేటప్పుడు ఈ తెగుల లక్షణాలు బయటపడతాయి.

తెగులు నిరోధక వరి వంగడాలను ఎంపిక చేసుకుని నాటుకోవాలి.పొలం ఒకసారి తడిగా, మరోసారి పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి.పొలం చుట్టూ ఉండే కాలువలో ఉండే నీరు శుభ్రంగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి.పంట పొలాన్ని లోతుగా దున్నడం వల్ల ఎండ బాగా తగిలి ఈ తెగులు రాకుండా ఉండే అవకాశం ఉంది.

కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.సాంప్రదాయ పద్ధతిలో పొలాన్ని దున్ని వరి పంటను సాగు చేయడం వల్ల వివిధ రకాల తెగులు పంటను ఆశించే అవకాశం ఉండదు.

వరి పొలంలో ( rice field )ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.పొలంలో కలుషితమైన నీరు ఉంటే వెంటనే బయటకు పారించి, భూమి కాస్త పొడి గా మారిన తర్వాత శుభ్రమైన నీరును వరి పంటకు అందించండి.ఈ కాటుక తెగులను పొలంలో గుర్తించిన తర్వాత కాపర్ ఆధారిత పిచికారి మందులను 2.5 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఉదాహరణకు కాపర్ హైడ్రాక్సైడ్ 53.8F లేదా ప్రోపి కొనజోల్ 11.7SC ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయడం వల్ల ఈ కాటుక తెగులు నివారించబడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube