తక్కువ పెట్టుబడి పెట్టి అధిక దిగుబడులు సాధించే పంటలలో గోధుమ పంట( Wheat Crop ) కూడా ఒకటి.గోధుమ పంటకు చీడపీడల తెగుళ్ల బెడద( Pests ) చాలా తక్కువ.
కాకపోతే కొన్ని రకాల తెగుళ్లు లేదా చీడపీడలు ఆశిస్తే.తొలి దశలోనే నివారిస్తే మంచి దిగుబడి పొందవచ్చు.
ఈ గోధుమ పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే వేరు కుళ్ళు తెగుళ్లు( Root Rot Pests ) కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ తెగుళ్లు ఒక ఫంగస్ వల్ల పంటను ఆశిస్తాయి.
తేమ లేదా వెచ్చని వాతావరణం లో వేసిన ధాన్యపు జాతి పంటలకు ఈ తెగుళ్లు ఆశించి నష్టం కలిగించడం సర్వసాధారణమే.మట్టిలో ఉండే ఇతర పంటల అవశేషాలలో ఈ ఫంగస్ జీవిస్తుంది.
గాలి లేదా వర్షపు నీరు ద్వారా ఆరోగ్యకరమైన మొక్కలకు సంక్రమిస్తుంది.

ముఖ్యంగా ఈ తెగుళ్లు గోధుమ,( Wheat ) బార్లీ( Barley ) లాంటి గడ్డి జాతి మొక్కలకు ఎక్కువగా ఆశించి నష్టం కలిగిస్తుంది.ఈ తెగుళ్లు ఆశించిన మొక్కలలో ఎదుగుదల పూర్తిగా తగ్గిపోతుంది.మొక్కలపై ముదురు గోధుమరంగు మచ్చలు కనిపిస్తాయి.
మొక్క యొక్క వేర్లు, మొక్క మొదలు క్రమంగా కుళ్ళిపోతాయి.పొలంలో అక్కడక్కడ పాలిపోయిన మరియు ఎదుగుదల మందగించిన మొక్కలు కనిపిస్తే ఆ మొక్కలకు వేరు కుళ్ళు తెగుళ్లు సోకినట్టే అని నిర్ధారించుకోవాలి.
గోధుమ మొక్క కంకులకు ఈ తెగులు సోకితే కంకి మొత్తం పాలిపోతుంది.

ఈ తెగులు పంటను ఆశించకుండా ఉండాలంటే తెగులు రహిత విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.నత్రజనిని( Nitrogen ) ఒకేసారి కాకుండా విడతలవారీగా పొలంలో వేయాలి.సేంద్రీయ పద్ధతిలో ఈ తెగుళ్లను అరికట్టాలంటే.
స్పోరోబోలోమైసిస్ రోసియస్ అనే ఫంగస్ ను ఉపయోగించి ఈ తెగుళ్లను నియంత్రించవచ్చు.ముఖ్యంగా విత్తనాలకు విత్తన శుద్ధి చేయడం వల్ల ఈ సూక్ష్మ క్రిముల మూలాలు నిర్మూలించబడతాయి.
తర్వాత పంటలలో ఈ తెగుళ్లు విస్తరించకుండా ఉంటుంది.