బంగాళా దుంప సాగులో ఆకు ముడత వైరస్ ను అరికట్టే పద్ధతులు..!

బంగాళదుంప( photato ) సాగుకు ఎటువంటి తెగులు సోకని ఆరోగ్యవంతమైన దుంపలను ఎంపిక చేసుకుని పొలంలో నాటుకోవాలి.పొలంలో ఉండే ఇతర మొక్కల వలన, పర్యావరణ పరిస్థితుల వలన ఈ ఆకుముడత వైరస్ బంగాళాదుంప పంటను ఆశిస్తుంది.

 Methods To Prevent Leaf Blight Virus In Photato Cultivation , Photato Cultivatio-TeluguStop.com

ఈ వైరస్ సోకితే ఆకుల అంచులు ముడతలు పడి ఎండిపోతాయి.ఆకు మధ్య మధ్య భాగం పసుపు రంగులోకి( yellow ) మారుతుంది.

ఆకు కింది భాగం ఊదా రంగులోకి మారుతుంది.ఈ వైరస్ సోకిన మొక్కలలో ఎదుగుదల పూర్తిగా మందగిస్తుంది.

కాడలు గట్టిపడి నిటారుగా నిలబడతాయి.ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటే దిగుబడి సగానికి పైగా తగ్గడంతో పాటు మార్కెట్లో బంగాళాదుంపలకు కనీస ధర కూడా లభించదు.

Telugu Agriculture, Aphid, Latest Telugu, Neem Oil, Parasitoids, Photato-Latest

ఈ ఆకుముడత వైరస్ ను నివారించడం కోసం ముందుగా వైరస్ సోకిన మొక్కలను పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.ఎందుకంటే ఒక మొక్క నుంచి మరొక మొక్కకు సులభంగా ఈ వైరస్ ( Virus )వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.తేమ అధికంగా ఉంటే ఈ వైరస్ వ్యాప్తి నివారించడం కష్టం.కాబట్టి నేలలో తేమ లేకుండా జాగ్రత్త పడాలి.

Telugu Agriculture, Aphid, Latest Telugu, Neem Oil, Parasitoids, Photato-Latest

ఈ వైరస్ ను నివారించడం కోసం ముందుగా సేంద్రియ పద్ధతులను పాటించాలి.ఆరోగ్యకరమైన దుంపల నుండి సేకరించిన విత్తనాలు మాత్రమే విత్తుకోవాలి.పంట పొలంలో ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే ఒక లీటరు నీటిలో మూడు మిల్లీలీటర్ల వేప నూనె( neem oil ) వేసి పిచికారీ చేయాలి.

ఇక ఈ వైరస్ ను ప్రత్యక్షంగా నివారించడం చాలా కష్టం.కానీ అఫిడ్ పాపులేషన్ ను ప్రెడేటర్ లేదా పారాసైటోయిడ్లు తగ్గిస్తాయి.లేడీ బర్డ్స్, సోల్జర్ బీటల్స్, లేస్ వింగ్స్ లు అఫిడ్స్ ను, లార్వాను తింటాయి.కాబట్టి ఈ వైరస్ వచ్చాక అరికట్టడం కాస్త కష్టమే.

అందుకే ఎటువంటి తెగులు సోకని ఆరోగ్యవంతమైన దుంపల నుండి సేకరించిన విత్తనాలను మాత్రమే నాటుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube