ఉల్లి సాగులో నల్ల బూజు ను అరికట్టే పద్ధతులు..!

సాధారణంగా ఉదాహరణంగా ఉల్లిపాయ( onion ) పై భాగంలో చుట్టూ నలుపు రంగు వలయం ఓ ఫంగస్ వల్ల ఏర్పడుతుంది.దీన్నే నల్ల బూజు గా పిలుస్తారు.

 Methods To Prevent Black Mold In Onion Cultivation , Asper Gillus Niger, Onion C-TeluguStop.com

అస్పెర్ గిల్లస్ నైగర్( Asper gillus niger ) అనే ఫంగస్ గాలి, నేల, నీటి ద్వారా పంటకు వ్యాపిస్తుంది.ఈ ఫంగస్ ఎటువంటి ప్రాంతంలో అయినా జీవించగలదు.

ఈ నల్ల బూజు సోకితే విత్తనాలు మొలకెత్తడం కంటే ముందే పూర్తిగా కుళ్ళిపోతాయి.ఒకవేళ విత్తనాలు మొలకెత్తిన సమయంలో ఈ నల్ల బూజు సోకితే మొక్క ఉబ్బి గాయాలు ఏర్పడి సరిపోతుంది.

పంట కోత సమయంలో కనుక ఈ నల్ల బూజు సోకితే ఉల్లిగడ్డ రంగు కోల్పోవడం, నాణ్యత క్షీణించడం లాంటివి జరుగుతాయి.కాబట్టి వీటిని సకాలంలో గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.

Telugu Agriculture, Latest Telugu, Plague, Red-Latest News - Telugu

ముందుగా తెగులను తట్టుకునే మేలురకం విత్తనాలను ఎంపిక చేసుకుని వాటిని విత్తన శుద్ధి చేసుకుని పొలంలో నాటుకోవాలి.పంటను ఎట్టి పరిస్థితుల్లో తడి వాతావరణం లో కోయ కూడదు.ఎర్రటి పోర ఆకులు( Red leaves ) కలిగిన ఉల్లి దాదాపుగా తెగులను తట్టుకొని నిలబడే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.కాబట్టి ఇటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి.

పంటను పోసిన వెంటనే పంట అవశేషాలను పొలం నుంచి తొలగించాలి.రెండు సంవత్సరాలకు ఒకసారి కచ్చితంగా పంట మార్పిడి చేయాలి.

Telugu Agriculture, Latest Telugu, Plague, Red-Latest News - Telugu

పంట పొలంలో ఏవైనా తెగులు, చీడ పీడల బెడద లాంటివి గుర్తించిన వెంటనే సేంద్రియ పద్ధతిలో నివారించేందుకు చర్యలు తీసుకోవాలి.ఒకవేళ వీటి వ్యాప్తి అధికంగా ఉంటే తప్పనిసరి పరిస్థితులలో రసాయన మందులను వినియోగించాలి.పొలం పెంటలో కలిపిన ట్రైకోడెర్మ ను మట్టిలో ఉల్లి విత్తనాలను నీరు పోసి తడిపి పొలంలో విత్తుకోవాలి.నీటిలో వేపచెక్క వేసి 60 డిగ్రీల వరకు వేడి చేసి అందులో ఉల్లి విత్తనాలను ముంచి ఆరబెట్టి నాటుకోవాలి.

ఇలా చేయడం వల్ల ఉల్లి యాంటీ ఫంగల్ లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది.ఇక పొలంలో ఎప్పటికప్పుడు కలుపు నివారించడంతోపాటు పశువుల ఎరువు కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వివిధ రకాల తెగుళ్ల నుండి పంటను సంరక్షించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube