పసుపు సిర మొజాయిక్ వైరస్ నుంచి బెండ పంటను సంరక్షించే పద్ధతులు..!

ఈ వైరస్ తెల్ల ఈగల ద్వారా వ్యాప్తి చెందుతుంది.ఆడ తెల్ల ఈగలు వైరస్లు వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

 Methods Of Protecting Gumbo Crop From Yellow Vein Mosaic Virus , Vein Mosaic Vir-TeluguStop.com

ఈ వైరస్ అన్ని దశలలో పంటను ఆశించే అవకాశం ఉంది.అయితే ఈ తెల్ల ఈగల వ్యాప్తి అధికంగా పంట నాటిన 35 రోజుల నుండి 50 రోజుల మధ్య అధికంగా ఉండే అవకాశం ఉంది.

ఉష్ణోగ్రత అధికంగా ఉన్న, తేమ అధికంగా ఉన్న సమయాలలో ఈ తెల్ల ఈగల( White flies ) ద్వారా పసుపు సిర మొజాయిక్ వైరస్ పంటలు ఆశిస్తుంది.

బెండ మొక్క ఆకులపై పసుపు ఈనే, మొజాయిక్ ( Yellow mite, mosaic )నమూనాలు కనిపించిన వెంటనే నివారించే చర్యలు చేపట్టాలి.

లేకపోతే పంట 90 శాతానికి పైగా దెబ్బతిని అవకాశం ఉంది.ఈ వైరస్ సోకిన వెంటనే మొదట ఆకులు పసుపు రంగులోకి మారడం ప్రారంభం అవుతుంది.ఆకు మొత్తం పసుపు రంగులోకి మారాక వాలి పోయి మొక్కలు ఎండిపోతాయి.ఇక పూత, పిందె దశలో సోకితే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే.

వేసవికాలంలో బెండ పంటను( gumbo crop ) ఈ వైరస్ అధికంగా ఆశించే అవకాశం ఉంది.కాబట్టి వేసవికాలంలో ఈ పంట సాగు చేయాలంటే ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ, సంరక్షక చర్యలు తీసుకోవాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.పొలంలో అక్కడక్కడ మొక్కలకంటే ఎత్తుగా ఉండే పసుపు రంగు అంటుకునే ఉచ్చులు ఏర్పాటు చేయాలి.

సేంద్రీయ పద్ధతిలో వేప నూనె, ఆవ నూనె, రైజో బ్యాక్టీరియా, క్రోజో ఫెరా నూనె, పల్మా రోసా నూనె లను ఉపయోగించి పంటకు సోకే తెగులను, లను నివారించవచ్చు.అయినా ఈ వైరస్ వ్యాప్తి తగ్గకపోతే ఒక లీటరు నీటిలో 40 గ్రాముల ఎసిటామిప్రిడ్ 20ఎస్ పి పంటకు పిచికారి చేయాలి.ఒకవేళ ఫలితం కనిపించకపోతే దగ్గర్లో ఉండే వ్యవసాయ క్షేత్రం నిపుణుల సలహాలు తీసుకొని నివారణ చర్యలు చేపట్టి పంటను సంరక్షించుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube