మొగ్గ కుళ్ళు వైరస్ నుండి వేరుశనగ పంటను సంరక్షించే పద్ధతులు..!

వేరుశనగ పంటను( Groundnut crop ) తీవ్ర నష్టం కలిగించే మొగ్గ కుళ్ళు వైరస్ అనేది మొక్కల టిష్యూను తినే కొన్ని రకాల కీటకాల వల్ల వస్తుంది.ఈ వైరస్ సోకితే మొక్కల కణజాలాలు పూర్తిగా దెబ్బతింటాయి.

 Methods Of Protecting Groundnut Crop From Bud Blight Virus..! , Groundnut Crop,-TeluguStop.com

తెగులు సోకిన మొక్కలలో ముందుగా లేత ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.తర్వాత ఆ పసుపు మచ్చలు కాస్త రంగు మారి నిర్జీవమైన రింగుల వలె మారిపోతాయి.

అనంతరం మొక్క యొక్క మొగ్గలు, కాండం, ఆకులు, కొమ్మలు కుళ్లిపోయి ఎండిపోతాయి.ఈ తెగులు సోకిన మొక్క ఎదుగుదల లోపిస్తుంది.

పంట దిగుబడి సగానికి పైగా తగ్గుతుంది.

వేరుశెనగ పంటను ఈ తెగులు ఆశించకుండా ముందుగా పొలంలో ఎటువంటి కలుపు మొక్కలు పెరగకుండా, పొలం చుట్టూ ఉండే కలుపు మొక్కలను పూర్తిగా తీసేయాలి.

తెగులను తట్టుకునే మెరుగైన విత్తనాలను ఎంచుకోవాలి.మొక్కజొన్న లేదా సజ్జలలో ఈ వేరుశనగను అంతర పంటగా వేస్తే ఈ తెగులు వ్యాపించవు.

మినుములు, పెసర లాంటి మొక్కలు వేరుశెనగ పంట సాగు చేస్తే ఈ మొగ్గకుళ్ళు వైరస్( Virus ) వ్యాప్తి చెందే అవకాశం ఉంది.ఈ వైరస్ ను గుర్తించిన వెంటనే ఆ మొక్కలను పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.వేరుశెనగ పంటలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను పీకేయాలి.ఈ మొగ్గ కుళ్ళు వైరస్ ఇతర మొక్కల ద్వారా వేరుశనగ మొక్కలకు వ్యాపిస్తుంది.భూమిలోని తేమ శాతాన్ని బట్టి నీటి తడులను అందించాలి.

సేంద్రీయ పద్ధతిలో ఈ మొగ్గ కుళ్ళు వైరస్ ను తొలగించాలి అనుకుంటే వేరుశనగ పంట వేసిన 20 రోజుల తర్వాత జొన్న మరియు కొబ్బరి ఆకుల రసాన్ని (Coconut leaf )పంటపై పిచికారి చేయాలి.ఇక రసాయన పద్ధతిలో ఈ వైరస్ ను నియంత్రించాలి అంటే రీజెంట్ SC లేదా యూనిప్రో SC లలో ఒక రసాయనాన్ని ఎంచుకుని లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube