మిరప పంట( Chilli Cultivation )ను రైతులు ఎర్ర బంగారంగా పిలుస్తారు.మిరప పంట సాగులో సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ, పంటను ఎప్పటికప్పుడు సంరక్షించుకుంటూ సాగు చేస్తే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొంది మంచి ఆదాయం పొందవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.
మిరప పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే.తెగులు నిరోధక ఆరోగ్యకరమైన నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి.
మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య అధిక దూరం ఉంటే మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.మొక్కల మధ్య దూరం ఉంటే ఏవైనా తెగుళ్లు లేదా చీడపీడలు ఆశిస్తే వ్యాప్తి తక్కువగా ఉంటుంది.
మిరప పంటలో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే, పంటను దాదాపుగా సంరక్షించుకున్నట్టే.ప్రధాన పొలంలో మిరప నారు నాటడానికి రెండు రోజుల ముందు ఒక లీటరు నీటిలో 1.5 మిల్లీలీటర్ల పెండిమిథలిన్ ను నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.మొక్కలు నాటిన 25 రోజులకు గుంటకతో అంతర కృషి చేయాలి.
ఆ తర్వాత కూడా కలుపు సమస్య అధికంగా ఉంటే ఒక ఎకరాకు 400 మిల్లీలీటర్ల క్వైజాలోఫాస్ ఇథైల్ ను మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారి చేయాలి.ఇంకా కలుపు మొక్కలు ఉంటే కూలీలచే తొలగించాలి.
మిరప పంటను డ్రిప్ విధానం ద్వారా సాగు చేసి ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగించడం వల్ల కలుపు సమస్య ఉండదు.
మిరప పంటకు రసం పిలిచే పురుగుల బెడద కాస్త ఎక్కువ.ప్రధాన పొలంలో నారు నాటుకోవడానికి ముందు నారు వేర్లను ఇమిడాక్లోప్రిడ్( Imidacloprid ) 0.5 మి.లీ + కార్బండిజం 1గ్రా ను ఒక లీటరు నీటిలో కలిపి, ఆ ద్రావణంలో మూడు లేదా నాలుగు నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత నాటుకోవాలి.