వాట్సప్ లో మెటా ఏఐతో ఛాటింగ్ ఎలా చేయాలంటే..?

ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్( Artificial Intelligence ) వాట్సప్ లోకి వచ్చేసింది.భారతదేశంలో ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు వాట్సాప్ లో మెటా ఏఐ ఐకాన్ కనిపిస్తోంది.

 Meta Starts Testing Ai Chatbot For Whatsapp,whatsapp,meta Ai,ai,chatbot,technolo-TeluguStop.com

మెటా రూపొందించిన అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో వాట్సప్( Whatsapp ) యూజర్లు ఎలాంటి ప్రశ్నలు అయినా అడగవచ్చు.మెటా ఏఐ దగ్గర కావలసిన సలహాలు, సూచనలు తీసుకోవచ్చు.

అయితే ప్రస్తుతానికి సరదాగా మాత్రమే ప్రశ్నలు అడగడం మంచిది.పర్సనల్ విషయాలను దీనితో షేర్ చేయకుండా ఉండడం ఉత్తమం.

ఎందుకంటే.మనం ఏఐ తో జరిపే సంభాషణ డేటాను ఎంతవరకు స్టోర్ చేసుకుంటుంది అనేది తెలియదు.

Telugu Chat, Chatbot, Meta Ai, Metaai, Whatsapp-Technology Telugu

వాట్సప్ యాప్ తెరవగానే పైన మెటా ఏఐ( Meta AI ) అని, దాని కింద with Llama అని కనిపిస్తుంది.దీనిని ఓపెన్ చేస్తే Ask Meta Al anything కనిపిస్తుంది.దాని కింద కొన్ని ప్రశ్నలను అదే సజెస్ట్ చేస్తుంది.ప్రస్తుతం ఈ ఏఐ ఫీచర్ కొన్ని దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది.ప్రస్తుతానికి ఇంగ్లీష్ భాష( English Language )ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.వాట్సప్ లో మెటా ఏఐతో ఛాటింగ్ ఎలా చేయాలంటే.

వాట్సప్ యాప్ తెరవగానే పై భాగంలో కుడి వైపున ఒక గుండ్రటి ఐకాన్ కనిపిస్తుంది.దానిని క్లిక్ చేస్తే టర్మ్ అండ్ కండిషన్స్ తెరపైకి వస్తాయి.

వాటిని పూర్తిగా చదివి యాక్సెప్ట్ చేయాలి.

Telugu Chat, Chatbot, Meta Ai, Metaai, Whatsapp-Technology Telugu

ఇక స్క్రీన్ పై కనిపించే ప్రాంప్ట్ ను ఎంచుకోవాలి.ఒకవేళ కావాలంటే మీకు ఏదైనా సందేహం ఉంటే అక్కడ పేస్ట్ చేయవచ్చు.ఇక సెండ్ బటన్ నొక్కితే చాలు మీరు ఏఐతో సంభాషణ ప్రారంభించవచ్చు.

మెటా ఏఐ జనరేట్ చేసిన సమాధానాలను లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ గుడ్ రెస్పాన్స్( Good Response ) , బ్యాడ్ రెస్పాన్స్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.యూజర్లు తమ అభిప్రాయాన్ని అక్కడ షేర్ చేయవచ్చు.

అయితే ఏఐ జనరేట్( AI Generate ) చేసిన కొన్ని సమాధానాలు తప్పుడు సమాధానాలు అయ్యే అవకాశం కూడా ఉందని ముందుగానే వాట్సప్ హెచ్చరిస్తుంది.ప్రస్తుతం వాట్సాప్ తన వినియోగదారుల నుంచి ఏఐ చాట్ బుక్ కు సంబంధించిన ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube