'సీతారామం' నుండి మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ 'కానున్న కళ్యాణం' విడుదల

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘సీతారామం’ చిత్రం ఆసక్తికరమైన ప్రొమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలు పెంచుతోంది.ముఖ్యంగా పాటలకు విశేషమైన స్పందన వచ్చింది.

 Mesmerizing Class Number Kaanunna Kalyanam From Sita Ramam Unleashed , Dulquer S-TeluguStop.com

తాజాగా ఈ చిత్రం నుండి థర్డ్ సింగిల్ ‘కానున్న కళ్యాణం’ పాట లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ పాట మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ గా విన్న వింటనే ఆకట్టుకుంది.

విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది.అనురాగ్ కులకర్ణి, సిందూరి ఈ పాటని ఆలపించిన విధానం అద్భుతంగా వుంది.

లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం పదికాలాలు గుర్తుపెట్టుకునేలా వుంది.

♪♪కానున్న కళ్యాణం ఏమన్నది ? స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ? ప్రతి క్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపు లేని గాధగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా.♪♪

పాట పల్లవిలో వినిపించిన ఈ సాహిత్యం మనసుకి గొప్ప హాయిని నింపేలా అనిపించాయి.అద్భుతమైన లోకేషన్స్ చిత్రీకరించిన ఈ పాట చాలా ఆహ్లాదకరంగా వుంది.

ముఖ్యంగా దుల్కర్, మృణాల్ మ్యజికల్ గా కనిపిస్తుంది.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో సర్ప్రైజ్ చేయనున్నారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది.

స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దృశ్య కావ్యంగా తెరకెక్కుతున్న ‘సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు.

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్ తదితరులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube