నాగేంద్రన్ ధర్మలింగం గడిచిన కొన్ని వారాలుగా ఈ భారతీయుడి పేరు మారుమోగుతోంది.సోషల్ మీడియాలో ప్రధాన వార్తగా నిల్చిన ఇతడి కోసం సింగపూర్ లో ప్రజలు క్షమాభిక్ష పెట్టాలని ఆదేశ అధ్యక్షుడిని వేడుకుంటూ సంతకాల సేకరణ చేపట్టారు.
సింగపూర్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.అతడి ఉరి శిక్షను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది.
అసలు ఎవరు ఈ నాగేంద్రన్ ఎందుకు అతడికి ఉరి శిక్ష పడింది, అతడు చేసిన నేరం ఏంటి, అనే వివరాలలోకి వెళ్తే.
సింగపూర్ లో మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకుంటూ 2009 అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి ఈ ధర్మలింగం.
అప్పట్లో ఆ కేసు పెను సంచలనం సృష్టించింది.దాంతో అన్ని సాక్ష్యాలు పరిశీలించిన తరువాత న్యాయస్థానం అతడికి ఉరి శిక్షను ఖరారు చేసింది.
గడిచిన 10 ఏళ్ళుగా జైల్లోనే మగ్గుతున్న అతడు చివరికి ఉరికంబం ఎక్కక తప్పదని భావించాడు.కానీ అతడికి ఉరి శిక్షను రద్దు చేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు అక్కడి స్థానికులు.
ఉరి శిక్ష విధించడం ఎంతో అమానుషమైన చర్యని, వెంటనే ఉరి శిక్షను రద్దు చేయలాని సంతకాల సేకరణ చేపట్టారు.దాదాపు 40 వేల మంది సంతకాలు చేయడమే కాకుండా ఆన్లైన్ లో అధ్యక్షుడికి అభ్యర్ధనలు పెట్టారు.

ఉరిక్షకు కేవలం మరో 10 రోజుల సమయం మాత్రమే ఉండటంతో తమ ఉద్యమాన్ని మరింతగా ఉదృతం చేశారు.ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల కార్యకర్తలు ఉద్యమించారు.తాను ప్రేమించిన అమ్మాయిని చంపేస్తామని కొందరి బెదిరింపుల కారణంగానే అతడు మాదక ద్రవ్యాలు దిగుమతి చేయాల్సి వచ్చిందని, అతడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని, ప్రస్తుతం అతడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, అలాంటి వ్యక్తిని ఉరి తీయడం మానవత ధర్మం కాదంటూ పెద్ద ఎత్తున ఉద్యమించడంతో అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఉరి శిక్షను రద్దు చేశారు అధికారులు.