పురుషులు ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే ఒత్తైన జుట్టు త‌మ సొంతం అవుతుంది!

ఒత్తైన జుట్టు కోసం అమ్మాయిలే కాదు అబ్బాయిలు సైతం తెగ ఆరాట పడుతుంటారు.ఈ క్రమంలోనే జుట్టు కోసం ఖరీదైన హెయిర్ ఆయిల్, షాంపూ వాడుతుంటారు.

అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మాత్రం మీ పల్చటి జుట్టును ఒత్తుగా మరియు ఆరోగ్యంగా మారుస్తుంది.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏమిటి అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి ఒకసారి వాటర్ తో వాష్ చేయాలి.

ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నాన‌బెట్టుకున్న మెంతుల‌ను వాటర్ తో సహా వేసుకోవాలి.

Advertisement
Men Can Get Thick Hair If They Follow This Simple Remedy! Men, Hair Care, Thick

అలాగే మరో కప్పు వాటర్ ను కూడా పోసి దాదాపు పన్నెండు నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

Men Can Get Thick Hair If They Follow This Simple Remedy Men, Hair Care, Thick

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మెంతులను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం మెంతుల‌ను వాట‌ర్‌తో స‌హా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, హాఫ్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని తలకు బాగా పట్టించి కాసేపు వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి.

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.పురుషులు వారంలో రెండు సార్లు ఈ సింపుల్ హోమ్ రెమెడీని పాటిస్తే పల్చటి జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా మారుతుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

అంతేకాదు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.తెల్ల జుట్టు సమస్య త్వరగా రాకుండా కూడా ఉంటుంది.

Advertisement

కాబట్టి ఒత్తైన జుట్టు కావాలని కోరుకునే పురుషులు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

తాజా వార్తలు