తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వద్దిరాజు రవిచంద్ర ..

తిరుమల శ్రీవారిని పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.ఈ ఉదయం విఐపి విరామ సమయంలో కమిటీ చైర్మన్ రమేష్ బిధూరితో కమిటీ సభ్యులు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

 Members Of The Parliamentary Standing Committee Visited Tirumala , Tirumala , V-TeluguStop.com

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.ఆలయం వెలుపల కమిటీ సభ్యులు వడ్డీ రాజు రవిచంద్ర మాట్లాడుతూ….

సీఎం కెసిఆర్ నేతృత్వంలో ఖమంలో జరిగిన బిఆర్ఎస్ ఆవిర్భావ శభ బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుందన్నారు.

6లక్షల మేర ప్రజలు పాల్గొని బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు.

ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చాల మంది ప్రజలు సభలో పాల్గొన్నారని….కేరళ సీఎం పినారై విజయన్.

, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.,పంజాబ్ సీఎం భగ్వాన్త్ మాన్.

,అఖిలేష్ యాదవ్ సంగీభావం ప్రకటించారన్నారు.మొదటి సభ గ్రాంట్ విక్టరీ ప్రజలు ప్రసాదించారని…మేము ఢిల్లీ వైపు చూస్తుంటే….

బీజేపీ హైదరాబాద్ వైపు చూస్తుందని వ్యాఖ్యలు చేసారు.కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు వారికీ నచ్చని పని చేస్తే దర్యాప్తు సంస్థల్ని ప్రయోగిస్తాయని తెలిపారు.

గత ప్రభుత్వాలు పెద్దగా ప్రయోగించేవికావు….కానీ ఈ ప్రభుత్వం బాగా వినియోగిస్తుందని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube