నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ మెహ్రీన్ పీర్జాదా, తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేసినా అమ్మడికి అదృష్టం మాత్రం కలిసి రాలేదు.
చేతినిండా సినిమాలు ఉన్నా హిట్టు అనే మాట ఆమె డిక్షనరీలో చేరలేదు.దీంతో బాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకుందాం అని వెళ్లిన మెహ్రీన్‌కు అక్కడ కూడా బ్యాడ్ లక్ ఎదురయ్యింది.
దీంతో ఆందోళనలో పడ్డ మెహ్రీన్‌కు రాజా ది గ్రేట్ సినిమా చాలా ఊరటనిచ్చిందని చెప్పాలి.మాస్ రాజా రవితేజతో కలిసి నటించిన ఈ సినిమాలో మెహ్రీన్ పాత్రకు మంచి పేరొచ్చింది.
ఈ సినిమా తరువాత ఆమె సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తుంది.తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది మెహ్రీన్.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో మెహ్రీన్ నటన ఆమెకు మంచి పేరు తెస్తుందని ఆమె ధీమాగా ఉంది.

ఎక్స్‌పోజింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని మెహ్రీన్ కేవలం నటనపరంగా మాత్రమే అభిమానులను సంపాదించుకుంది.అయితే గతంలో బొద్దుగా మారిన మెహ్రీన్ మళ్లీ స్లిమ్ లుక్‌లోకి రావడానికి చాలానే కష్టపడింది.అయితే అనుకున్న స్థాయిలో హిట్ సినిమాలు లేని ముద్దుగుమ్మ మెహ్రీన్ ఎంతమంచివాడవురా సినిమాతోనైనా అదిరిపోయే హిట్ కొడుతుందేమో చూడాలి.
కాగా ఫోటోషూట్‌లతో ప్రేక్షకులను మెహ్రీన్ ఎల్లప్పుడూ అలరిస్తూనే ఉంది.
