సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ ఉంటారు.కొత్త డిజైన్స్ వస్తే చాలు వెంటనే ధరిస్తూ ఉంటారు.
ఇక స్టార్ హీరోయిన్లు మాత్రం అస్సలు తగ్గరని చెప్పాలి.కొత్తగా ఏవి వచ్చినా కూడా వెంటనే ట్రై చేస్తుంటారు.
వెంటనే ఫోటో షూట్లు చేయించుకుంటూ నెట్టింట్లో పెట్టి బాగా రచ్చ చేస్తుంటారు.ప్రతిరోజు సెలబ్రిటీలు తిండి లేకుంటే ఉంటారేమో కానీ ఫోటో షూట్ చేయించుకోకుండా ఉండరని చెప్పాలి.
అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా కొత్త లుక్కుతో దర్శనమిచ్చింది.ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు మెహరీన్ కౌర్.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ మెహరీన్ కౌర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.పంజాబీ కి చెందిన ఈ బ్యూటీ తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
చిన్న హీరోలతోనే కాకుండా స్టార్ హీరోల సరసన కూడా నటించి తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.మెహరీన్ తొలిసారిగా నాచురల్ స్టార్ హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఈ సినిమాలో తన నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తర్వాత మరిన్ని సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ కూడా.అవకాశాలు మాత్రం వరుసగా వస్తున్నాయి.అలా అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకుంది.తెలుగులోనే కాకుండా తమిళం, పంజాబీ, హిందీ సినిమాల్లో కూడా నటించింది మెహరీన్.
ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉందని తెలుస్తుంది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా ఎనర్జీగా కనిపించడంతో.
నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.తన సినిమాల అప్డేట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని కూడా షేర్ చేస్తుంది.అప్పుడప్పుడు తను చేసే విన్యాసాల వీడియోలను కూడా బాగా పంచుకుంటుంది.

తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేస్తుంది.తనకు షూటింగులు లేకుండా ఉంటే చాలు ఎక్కువగా ఫ్యామిలీతోనే గడుపుతుంది.ఇటీవలే తన ఫ్యామిలీ అందరితో కలిసి కొన్ని విదేశాలలో తిరిగింది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటో పంచుకుంది.కొత్త డిజైన్ తో ఉన్న ఒక లాంగ్ ఫ్రాక్ ని వేసుకుంది.

ఇక అది మొత్తం బ్లూ కలర్ లో ఉండగా ఆ డ్రస్ తో కొన్ని ఫోటోషూట్లు చేయించుకుంది.అయితే నిజానికి ఆమె ఆ డ్రస్ లో మునిగిపోయినట్లు కనిపించింది.దీంతో ఆ ఫోటోలు చూసి కొందరు ఆ డ్రెస్ గురించి లైక్స్ కొట్టగా మరికొందరు టోల్ చేయడం మొదలుపెట్టారు.
మెహరీన్ ఎక్కడ.డ్రెస్ తప్ప ఆమె కనిపించడం లేదు కదా అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి
.






