టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్( Mehreen ) గురించి మనందరికి తెలిసిందే.మెహ్రీన్ కి గతంలో ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
అయితే పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతున్నారు అనుకుంటున్న తరుణంలో బ్రేకప్ చెప్పేసింది.కాగా మెహ్రీన్ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ ని ( Bhavya Bishnoi ) ప్రేమించి ఆయనతో నిశ్చితార్థం కూడా చేసుకుంది.
కానీ ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నట్లు సంచలన ప్రకటన చేసింది.ఇక నుంచి భవ్యతో గానీ, ఆయన కటుంబ సభ్యులతో గానీ తనకు ఎలాటి సంబంధం లేదు అని స్పష్టం చేసింది.

అయితే అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు మెహ్రీన్.అయితే ఆమె పెళ్లిని రద్దు చేసుకోవడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని చాలామంది అభిప్రాయపడ్డారు.అయితే మెహ్రీన్ నిశ్చితార్థం చేసుకొని బ్రేకప్ చెప్పిన భవ్య బిష్ణోయ్ తాజాగా మరొకరితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.ఐఏఎస్ అధికారి పరి బిష్ణోయ్ తో భవ్య బిష్ణోయ్ నిశ్చితార్థం జరిగింది.
త్వరలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.ఈ విషయాన్ని భవ్య బిష్ణోయ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

భవ్య ఎంగేజ్మెంట్( Bhavya Bishnoi Engagement ) ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరోసారి మెహ్రీన్ ఎంగేజ్మెంట్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి.కాగా హీరోయిన్ మెహ్రీన్ మొదట కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఇటీవల ఎఫ్3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది.ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంది.
తరచూ ఫిట్నెస్ కి సంబంధించిన ఫోటోలు గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.







