కొన్ని సినిమాలను కల్పిత కథలతో రూపొందిస్తే, మరికొన్ని నిజజీవితంలోని వ్యక్తులు, సంఘటనల ఆధారంగా తీస్తుంటారు.అలా వాస్తవ కథల స్ఫూర్తితో నిర్మించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బెర్గ్ తీసిన ‘ది టెర్మినల్’సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుంది.దౌత్యపరమైన కారణాలతో 18 ఏళ్లుగా పారిస్‌లోని ఛార్లెస్ డిగాల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయిన ఓ వ్యక్తి కథతో ఈ సినిమా తీశారు.
ఆయనే మెహ్రాన్ కరీమీ నస్సేరి. శనివారం ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
మెహ్రాన్ 1988లో పారిస్ విమానాశ్రయానికి రాగా, దౌత్యపరమైన కారణాలతో ఆయన్ను పారిస్‌లోకి అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు.దీంతో ఆయన విమానాశ్రయంలోని టెర్మినల్‌లో ఉండిపోయారు.ఈ కథతో 2004లో స్పీల్‌బర్గ్ ‘ది టెర్మినల్’ సినిమాను తెరకెక్కించారు.ఇందులో మెహ్రాన్ పాత్రను ప్రముఖ నటుడు టామ్ హ్యాంక్స్ పోషించారు.
తర్వాత కూడా ఎంతోమంది ఆయన పరిస్థితిపై డాక్యుమెంటరీలు రూపొందించారు.దీంతో ది టెర్మినల్ మ్యాన్‌గా నస్సేరి పాపులర్ అయ్యారు.2006లో అనారోగ్యానికి గురవడంతో చికిత్స కోసం ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.తర్వాత పారిస్‌లో ఉండేందుకు అనుమతించడంతో, అక్కడి హాస్టల్‌లో నివసించేవారు.
కొద్దివారాల క్రితం తిరిగి విమానాశ్రయానికి వచ్చిన ఆయన, శనివారం గుండెపోటుతో చనిపోయారని అధికారులు తెలిపారు.

నస్సేరి 1945లో ఇరాన్‌లో జన్మించారు.తన తల్లిని వెదుకుతూ బ్రిటన్ చేరుకున్న ఆయనకు అక్కడి అధికారులు అనుమతి నిరాకరించడంతో కొద్దిరోజులు విమానాశ్రయంలో గడిపి, పారిస్‌కు చేరుకున్నారు.అక్కడి అధికారులు సైతం అనుమతి నిరాకరించడంతో ఎయిర్‌పోర్టులోని టెర్మినల్ వన్‌లో ఇంటర్నేషనల్ లాంజ్‌లో ఉండిపోయారు.తర్వాత ఆయన కథ సినిమాగా రావడంతో ది టెర్మినల్ మ్యాన్‌గా పాపులర్ అయ్యారు.
2004 టామ్ హాంక్ చలనచిత్రం “ది టెర్మినల్” స్టీవెన్ స్పీల్‌బర్గ్ అత్యుత్తమ చిత్రాలలో ఒకటి.ఈ చిత్రం న్యూయార్క్‌లోని JFK విమానాశ్రయంలో చిక్కుకున్న విక్టర్ నవోర్స్కీ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది.నవోర్స్కీ పాత్రను ప్రేరేపించిన వ్యక్తి శనివారం గుండెపోటుతో మరణించాడు.ఇరాన్ జాతీయుడు మెహ్రాన్ కరీమి నస్సేరీ పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయంలో సుమారు 18 సంవత్సరాలు నివసించారు.టెర్మినల్ 2ఎఫ్‌లో ఆయన తుది శ్వాస విడిచినట్లు విమానాశ్రయ అధికారులు ధృవీకరించారు.
అత్యవసర సేవలకు ఫోన్ చేసినప్పటికీ, నాస్సేరీని కాపాడేందుకు వారు వెంటనే స్పందించలేకపోయారు.అయితే ఆ వ్యక్తి 1988లో నివాస పత్రాలు లేకపోవడంతో విమానాశ్రయంలో ఉండడం ప్రారంభించాడు.
తరువాత అతనికి శరణార్థి పత్రాలు మంజూరు చేసినా.అతను వాటిపై సంతకం చేయడానికి నిరాకరించి అదే విమానాశ్రయంలో ఉండిపోయాడు.

అయితే ఈ నాస్సేరీ తండ్రి ఇరానియన్ తల్లి బ్రిటిష్ కి చెందింది.అంటే ఇరాయన్ కు బ్రిటిషన్ కు పుట్టిన వారు నాస్సేరి.రాజకీయ చైతన్యం కోసం జైలు శిక్ష అనుభవించిన తనను బ్రిటీష్ నుంచి బహిష్కరించారు.ఆ వ్యక్తి 1988లో చార్లెస్ డి గల్లె ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంలో దోచుకోవడంతో.
ఎలాంటి పత్రాలు లేకుండానే పారిస్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.సరైన పత్రాలు లేవని.
లండన్ విమానం ఎక్కినా కూడా తనను వెనక్కి పంపించారు సిబ్బంది.

1999లో తన బెంచ్ పై కూర్చొని పొగకాలుస్తూ.కళ్ల మీద పడ్డ పొడవాటి సన్నటి జుట్టుతో బోలుగా ఉన్న బుగ్గలతో బలహీనంగా కనిపించాడు.అయినా కూడా తాను ఆ విమానాశ్రయం నుంచి బయలుదేరుతాను అని.పాస్ పోర్ట్ లభిస్తుంది అని దాని కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పుకచ్చారు.అతను విమానాశ్రయంలో ఉన్న సమయంలో, నాస్సేరి మినీ-సెలబ్రిటీ అయ్యాడు.
విమానాశ్రయంలోని సిబ్బంది అతన్ని లార్డ్ ఆల్ఫ్రెడ్ అని పిలిచేవారు.అతను ఎర్రటి ప్లాస్టిక్ బెంచ్‌పై పడుకుని విమానాశ్రయం గుండా ప్రయాణించే ప్రయాణికులతో మాట్లాడుతుండేవారు.
ఎయిర్‌పోర్టు సిబ్బంది తనకు బాగా తెలుసని, వారి సౌకర్యాలపై ఆయన వరాల జల్లు కురిపించేవారు.నాస్సేరీ ఎయిర్‌పోర్ట్‌లో డైరీలు రాయడం, మ్యాగజైన్‌లు చదవడం ఇంక టెర్మినల్‌లో దాదాపు అందరితో స్నేహం చేసేవారు.







