దివంగత హీరో చిరంజీవి కొడుకు పేరేంటో తెలుసా?

కన్నడ స్టార్ హీరో దివంగత చిరంజీవి సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కెరియర్లో అప్పుడప్పుడే ఉన్నత స్థాయిలోకి ఎదుగుతున్న చిరంజీవి సర్జాను మృత్యువు కూడా అదే స్థాయిలో వెంబడించిందని చెప్పవచ్చు.

 Meghana Raj And Chiranjeevi Sarja's Son Named Raayan Raj Sarja, Meghana Raj,chir-TeluguStop.com

స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస అవకాశాలను దక్కించుకుంటున్న క్రమంలో మృత్యువు గుండెపోటు రూపంలో వచ్చి తనని అందనంత దూరానికి తీసుకువెళ్ళింది.కేవలం 35 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో మరణించడం పట్ల ఆయన అభిమానులు, కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయ్యింది.

తమ అభిమాన నటుడు మరణం నుంచి కోలుకోవడానికి తన అభిమానులకు చాలా సమయం పట్టిందని చెప్పవచ్చు.

చిరంజీవి సర్జా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుని నటి మేఘన రాజ్ ను వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత రెండు సంవత్సరాలకి చిరంజీవి సర్జా మరణించడమే కాకుండా అతను మరణించే సమయానికి తన భార్య మేఘన 5 నెలల గర్భిణీ స్త్రీ.ఇలాంటి సమయంలో తన భర్త మరణం తనని బాగా క్రుంగదీసింది.

చిరంజీవి చనిపోయిన కొన్ని నెలలకే మేఘన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఈ క్రమంలోనే తమ అభిమాన నటుడు మరి ఈ విధంగా పుట్టాడని అభిమానులు అందరూ తనకి జూనియర్ చిరంజీవి సర్జా అంటూ ప్రేమగా పిలుచుకునే వారు.

Telugu Chiranjeevi, Kannada, Meghana Raj, Meghanaraj, Meghana Raj Son-Movie

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మేఘన తన కొడుకు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసేవారు.ఇక తాజాగా చిరంజీవి వారసుడికి నామకరణం చేశారు.ఈ క్రమంలోనే జూనియర్ సర్జాగా పిలవబడుతున్న ఈ చిన్నారికి రాయన్ రాజ్ సర్జ అని నామకరణం చేస్తూ తన కొడుకు పేరును ప్రకటించారు.చిరు మరణం తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైన మేఘన ఇంట్లోనే కూర్చోవడం వల్ల తన జ్ఞాపకాల నుంచి బయటకు రాలేనన్న ఉద్దేశంతో తిరిగి సినిమాలపై తన దృష్టిని సారించారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె “సెల్ఫీ మమ్మీ.గూగుల్ డాడీ” సినిమాతో పాటు, బుద్ధిమంత 2లో నటిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube