అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా..
ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు క్రికెట్ ఔత్సాహికులు సైతం ఎదురు చూసారు.మరి వారి ఎదురు చూపులకు ఇన్నాళ్లకు ఫలితం దక్కింది.
నిన్న ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ బాలీవుడ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుకున్నారు.
ఈ సినిమా కోసం మన తెలుగు సినీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా నటించాడు.ఇది తనకు మొదటి డెబ్యూ సినిమా.ఈ సినిమా ఈ ఏడాది పెద్ద సినిమాల్లో ఒకటిగా రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.
ఈ సినిమాపై బాలీవుడ్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది.ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా హిట్ అందుకోలేదు.ఇదే క్రమంలో సౌత్ సినిమాలు అక్కడ వందల కోట్లు వసూలు చేస్తుండడం అక్కడి హీరోలకు మింగుడు పడని విషయంగా మారింది.దీంతో ఈ సినిమా అయినా వీరి ఆశలు తీర్చి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని అక్కడి వారంతా కోరుకుంటున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్న నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ తో పాటు రాజమౌళి, సుకుమార్, నాగార్జున, నాగ చైతన్య, అమీర్ ఖాన్ అందరు కలిసి అమీర్ ఖాన్ ప్లాన్ చేసిన స్పెషల్ ప్రివ్యూ షో చూడరు.ఈ షో చుసిన తర్వాత మెగాస్టార్ ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ తన హ్యాపీ నెస్ ను పంచుకున్నాడు.
అమీర్ ఖాన్ ను గత కొన్నేళ్ల క్రితం జపాన్ లో కలిశానని.మళ్ళీ ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ లాల్ సింగ్ చద్దా సినిమా ప్రీమియర్ కి కలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ.ఈ సినిమా అద్భుతమైన భావోద్వేగాలతో ఈ సినిమా చాలా బాగుందని చిరు కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.