టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు చిరంజీవి ( Chiranjeevi ) ఒకరు.ఈయన ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు( Young Heroes ) గట్టి పోటీ ఇస్తున్నటువంటి చిరంజీవి విశ్వంభర అని సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇలా విభిన్న పాత్రలలో నటించినటువంటి చిరంజీవి ఇప్పటివరకు మనకు ఒక జబ్బు ఉన్నటువంటి వ్యక్తి పాత్రలో మాత్రం అసలు నటించలేదు.ఇలా ఇప్పటివరకు ఈయన చేసిన ఏ సినిమాలో కూడా ఈయన ఏదైనా జబ్బుతో బాధపడుతూ ఉన్న వ్యక్తిగా మాత్రం నటించలేదు అలా నటించకపోవడానికి కారణం ఉందని తెలుస్తుంది.ఈయనకు కొన్ని కోట్లలో రెమ్యూనరేషన్( Remuneration ) అదనంగా ఇచ్చినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి పాత్రలలో తాను నటించనని ఖరాఖండిగా చెప్పేశారట ఇలా చెప్పడంతోనే ఈయన కోసం ఇలాంటి పాత్రలు కూడా రాయారని తెలుస్తోంది.

ఇక చిరంజీవి ఇలా జబ్బు చేసిన వ్యక్తి పాత్రలలో ఎందుకు నటించరు అలా నటించకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే కేవలం తన తల్లి కోసమే ఈయన నటించరని తెలుస్తుంది.తన తల్లి అంజనా దేవి( Anjana Devi ) కి తన కొడుకులు అంటే ఎంతో ప్రేమ .అయితే తన కొడుకులు ఏదైనా జబ్బుతో బాధపడుతున్నట్టు కనుక చూస్తే అసలు తట్టుకోలేరట.ఇలా తన కొడుకులను అలా జబ్బుతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తులుగా చూసి తన తల్లి మనసు బాధపడుతుందని అందుకే ఇలాంటి పాత్రలలో నటించవద్దు అంటూ ఈమె తన కొడుకుకి చెప్పారట అందుకే చిరంజీవి తల్లికి ఇచ్చిన మాట కోసం తన తల్లిని బాధ పెట్టడం ఇష్టం లేక కొన్ని కోట్లల్లో రెమ్యూనరేషన్( Remuneration ) అధికంగా ఇచ్చినప్పటికీ కూడా తాను జబ్బుతో బాధపడే వ్యక్తి పాత్రలలో నటించనని నిర్మాతలకు చెప్పేస్తారట అందుకే ఈయన వద్దకు ఈ విధమైనటువంటి కథలను కూడా దర్శక నిర్మాతలు తీసుకురారని తెలుస్తోంది.







