సినిమా ఇండస్ట్రీ లో స్టార్లు కావాలంటే ఈజిగా అయిపోరు…దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి, అలా చేసిన వాళ్లే స్టార్ హీరోలు అవుతారు అలాంటి వాళ్లలో నెంబర్ వన్ లో ఉంటారు చిరంజీవి,( Chiranjeevi ) కష్టపడి పైకి వచ్చారు కాబట్టి చిరంజీవి కి ఇండస్ట్రీ లో ఉండే ప్రతి ఒక్కరి కష్టం గురించి తెలుసు అందుకే ఆయన ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడరు, అయితే చాలా మంచిగా కనిపించే చిరంజీవి కి అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది… కానీ కోపం వస్తే మాత్రం ఆయన కోపాన్ని ఆపడం ఎవరి తరం కాదు అని ఇండస్ట్రీలో ఉన్న జనాలు చెప్పుకుంటూ ఉంటారు.ఇక చిరంజీవి తనతో నటించిన కొంతమంది హీరోయిన్లతో చాలాసార్లు అసౌకర్యంగా ఫీల్ అయిన సంగతి మనకు తెలిసిందే.
గతంలో చిరంజీవి స్టార్ హీరో కాకముందే హీరోయిన్ మాధవి తన కారులో కూర్చుంటే నా పక్కన కూర్చుంటావా అంటూ అవమానించిన సంగతి ఇప్పటికే చాలాసార్లు మనం విన్నాం.అయితే ఈ హీరోయిన్ లాగే మరో హీరోయిన్ కూడా చిరంజీవిని గడ్డిపరకలా తీసేసిందట…
అంతేకాదు మూవీ యూనిట్ ని కూడా ఎలా పడితే అలా అవమానించినట్లు మాట్లాడిందట.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు నటి నగ్మా.( Heroine Nagma ) నగ్మా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే రెండు మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అవడంతో తనకి కొన్ని రోజుల్లోనే స్టార్ స్టేటస్ వచ్చింది.
అలా వచ్చిన స్టేటస్ ని కాపాడుకోకుండా నగ్మా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది.ఇక నగ్మా చిరంజీవి కాంబినేషన్ లో ఘరానా మొగుడు సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఆ తర్వాత ముగ్గురు మొనగాళ్లు( Mugguru Monagallu ) సినిమాని తీశారు…
ఇందులో కూడా నగ్మా హీరోయిన్ గా చేసింది.అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో నగ్మా తన ఇష్టం ఉన్నప్పుడు షూటింగ్స్ కి వచ్చి సినిమా సెట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేది.అంతేకాదు ఈ సినిమాని స్వయంగా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు నిర్మాతలుగా వ్యవహరించారు.వారి డబ్బుని, సమయాన్ని వృధా చేస్తూ నగ్మా ఇష్టం వచ్చిన తీరులో ప్రవర్తించేది…అయితే ఓ రోజు నగ్మా తీరు చూసినా చిరంజీవి ఇలా అయితే పని కాదు అని డైరెక్ట్ గా తన మేకప్ రూమ్ కి పిలిచి గట్టిగా అడిగాడు.
దానికి నగ్మా తిక్క తిక్క సమాధానం చెప్పడంతో చిరంజీవి నగ్మా కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.అంతేకాదు నువ్వు ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చావ్ ఇలా చేస్తే ఇండస్ట్రీలో ఎదగడం కష్టం అంటూ వార్నింగ్ ఇచ్చాడట.
ఇక అప్పటినుండి నగ్మా తన తీరు మార్చుకొని కరెక్ట్ టైం కి షూటింగ్ కి వచ్చేదట…