మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో దసరా పండుగకు వచ్చిన మెగాస్టార్ ఇప్పుడు సంక్రాంతి పండుగకు ”వాల్తేరు వీరయ్య” సినిమాలో వస్తున్నాడు.
చిరంజీవి మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’.ఈ సినిమాపై ఇప్పటికే ఇటు మెగా ఫ్యాన్స్ తో పాటు అటు మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అందరిని ఆకట్టు కుంటుంది.ఈ సినిమా నుండి వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి.
ఇక ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘నీకేమో తొందరెక్కువ‘ అనే పెప్పీ మెలోడీ సాంగ్ రేపు ఉదయం 10.35 నిముషాలకు హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో లాంచ్ చేయనున్నట్టు మేకర్స్ ఒక మాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.మరి ఈ సాంగ్ ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాల్సిందే.

2023 సంక్రాంతి బరిలో భారీ పోటీ మధ్య వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కాబోతుంది.బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.చూడాలి మరి బాలయ్యతో పోటీలో చిరు విన్ అవుతాడో లేదో.







