చిరంజీవి( Chiranjeevi ) అంటే కేరాఫ్ అడ్రస్ డాన్స్ కి మాత్రమే ఆ తర్వాతే తన మాస్ ఇమేజ్ అయినా లేదంటే నటన అయినా.సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చిరంజీవి డాన్స్ లకు మాత్రమే గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపిస్తూ ఉంటుంది.
అయితే చాలా రోజులుగా చిరంజీవిలో అదే లోపం కూడా కనిపిస్తోంది ఎందుకంటే ఏ గత కొన్ని సినిమాల్లో చిరంజీవి స్టెప్స్ రొటీన్ గా ఉంటున్నాయి.డాన్స్ విషయంలో అస్సలు శ్రద్ధ వహించినట్టు కనిపించదు.
ఎక్కడ చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150 లో తన మాస్ స్టెప్పులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు చిరంజీవి ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, ఆచార్య వంటి సినిమాల్లో అస్సలు ఒక్క మూమెంట్ కూడా గుర్తుపెట్టుకున్నది లేదు.

అయితే ఈ విషయం సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో నానుతూనే ఉంది మరి చిరంజీవి దాన్ని గమనించారో లేదో తానే కొత్తగా రావాలని ట్రై చేస్తున్నారో ఏమో తెలియదు కానీ వశిష్ట దర్శకత్వంలో( Director Vasishta ) వస్తున్న విశ్వంభర సినిమా కోసం మాత్రం సరికొత్త ప్రయోగాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.ఈ సినిమాకు ఇన్నాళ్ళ వరకు శేఖర్ మాస్టర్,( Sekhar Master ) జాని మాస్టర్( Jani Master ) చేత కొరియోగ్రఫీ చేయించుకున్న చిరంజీవి కొత్త వారితో వస్తున్నాడట.తనకు ఇప్పటి వరకు కొరియోగ్రఫీ చేయని వారైతే ఏదైనా కొత్తగా ప్రయత్నించే అవకాశం ఉంటుందని అనుకున్నారో ఏమో కానీ విశ్వంభర సినిమాలో( Vishwambhara Movie ) ఇప్పటికే సిద్ధమైన రెండు పాటలకు ఇద్దరు కొరియోగ్రాఫర్స్ చేత స్టెప్పులు కంపోజ్ చేయించారట.

చిరంజీవి ఒకప్పుడు డాన్సులతో ఇరగదీసేవారు.ఆయన 90’s సినిమాల్లో వేసిన స్టెప్పులు ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి.ఆ మాయాజాలం మళ్ళీ చేయాలని దర్శకుడు వశిష్ట గట్టిగా ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అందుకే ఈ సినిమాలోని మొదటి పాటకు బిన్నీ ( Choreographer Binni ) చేత కొరియోగ్రఫీ చేయించగా రెండవ పాటను శోభి తో( Choreographer Shobi ) కంపోజ్ చేయించారు.మరి ఈ కొత్త కొరియోగ్రాఫర్స్ ఇప్పటి వరకు చిరంజీవికి పని చేయలేదు.
ఈ ఇద్దరు మాస్టర్స్ వెరీ వెరీ హీరోలకు పని చేసిన చిరంజీవితో పని చేయడం కొత్తే.మరి ఈ కొత్త కెమిస్ట్రీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి.







