తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) ఉన్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే.68 సంవత్సరాల వయస్సులో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉండటం చిరంజీవికి మాత్రమే సాధ్యమైందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.తన సినిమాలతో మాస్ ప్రేక్షకులను మెప్పించిన చిరంజీవి సినిమా టికెట్ 30 సంవత్సరాల క్రితమే 800 రూపాయలు పలికింది.
ఇప్పుడు 800 రూపాయలు అంటే మరీ ఎక్కువ మొత్తం కాదు కానీ 30 సంవత్సరాల క్రితం ఈ మొత్తం అంటే చాలా ఎక్కువ అనే సంగతి తెలిసిందే.
అప్పట్లో చిరంజీవి వీరాభిమాని ఒకరు 800 రూపాయలకు ముఠామేస్త్రి మూవీ టికెట్ ను( Mutamestri Movie Ticket ) కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఆ మొత్తం ఇప్పుడు లక్ష రూపాయలతో సమానం అని చెప్పవచ్చు.
అప్పట్లో ఈ విషయం తెలిసి చిరంజీవి సైతం తెగ సంతోషించారట.

చిరంజీవి కెరీర్ లోని భారీ బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా ఒకటి కాగా యంగ్ జనరేషన్ ఫ్యాన్స్ సైతం చిరంజీవిని ఎంతో అభిమానిస్తున్నారు.యాక్టింగ్ స్కిల్స్, డైలాగ్ డెలివరీ, అదిరిపొయే లుక్స్ తో చిరంజీవి అభిమానులకు( Chiranjeevi Fans ) అంతకంతకూ దగ్గరయ్యారు.చిరంజీవి విశ్వంభర సినిమాతో( Viswambhara Movie ) ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.
ఈ సినిమా బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడటం లేదు.

స్టార్ హీరో చిరంజీవి వేగంగా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చిరంజీవి విశ్వంభర తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
విశ్వంభర మూవీలో విజువల్ ఎఫెక్స్ట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.







