చిరంజీవి( Chiranjeevi ) హీరో గా చెయ్యాల్సిన చాలా సినిమాలు ఇప్పుడు లైన్ లో ఉన్నాయి.అందులో వశిష్ట సినిమా( Director Vasishta ) అనౌన్స్ అయిన విషయం మనకు తెలిసిందే ఇక ఈ సినిమా తర్వాత కూడా ఇంకా చాలా సినిమాలు లైన్ లో పెట్టాడు చిరంజీవి…కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉండగా ఈ సినిమా తర్వాత రీసెంట్ గా రజినీకాంత్ తో జైలర్ సినిమా( Jailer Movie ) తీసి ఒక సూపర్ హిట్ కొట్టిన నెల్సన్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…
దానికి సంభందించిన ఒక స్టోరీ ని కూడా ఇప్పటికే నెల్సన్ చిరంజీవి కి చెప్పినట్టు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు…ఇప్పటికే ఈ ఇయర్ లో చిరంజీవి రెండు సినిమాలను రిలీజ్ చేశారు.అందులో వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అవ్వగా భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) మాత్రం ప్లాప్ అయింది ఇక ఎవరికీ సాధ్యం కాని విధంగా వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి సైతం షాక్ ఇస్తున్నాడు…
ఇక ఈయన ఇప్పటికీ కుర్ర హీరోల మాదిరిగా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు తీస్తూ వరుసగా సక్సెస్ లు కొడుతూ ఇండస్ట్రీ లో ముందుకు దూసుకెళ్తున్నాడు… ఇక ప్రస్తుతం అందరూ చిరంజీవి నెల్సన్( Director Nelson Dilip Kumar ) కాంబో లో సినిమా వస్తె బాగుండు అని అంటున్నారు ఎందుకంటే రజిని కాంత్ కి ఎలాంటి ఎలివేషన్స్ అయితే ఇచ్చాడో అలాంటి ఒక ఎలివేషన్స్ తో చిరంజీవి కి ఒక సినిమా పడితే ఇక ఇండస్ట్రీ లో ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందనే చెప్పాలి…ఇక ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి…