మెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అనంతరం ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.ఇలా వరుస సినిమాలతో ప్రస్తుతం మెగాస్టార్ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక మెగాస్టార్ వారసులుగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు పొందారు.ఇదే బాటలోనే ఆయన పెద్ద కుమార్తె సుస్మిత కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.
కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న సుస్మిత గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే గోల్డ్ బాక్స్ నిర్మాణ సంస్థలో సుస్మిత ఒక వెబ్ సిరీస్ ను నిర్మించి మంచి గుర్తింపు పొందారు.
ఈ క్రమంలోనే శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాని కూడా నిర్మించారు.త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది.మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన సుస్మితకు తన చేతిలో పెద్ద హీరోలు ఉన్నప్పటికీ తాను మాత్రం ముందుగా చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇకపోతే తాజాగా మెగాస్టార్ తన కూతురు నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు.

సరైన కథ దర్శకుడు దొరికితే తన కూతురు గోల్డె బాక్స్ నిర్మాణంలో సినిమా చేస్తానని మెగాస్టార్ ప్రకటించారు.ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే సుమారుగా 80 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.అయితే తన కూతురితో అంత బడ్జెట్ పెట్టకుండా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే చిరంజీవి ఒక్కో సినిమాకి 30 నుంచి 50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు.
ఈ క్రమంలోనే తన కూతురు సినిమా కోసం ఏ మాత్రం రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేయాలని మెగాస్టార్ భావించినట్లు తెలుస్తోంది.జీరో రెమ్యూనరేషన్ తో తన కూతురు గోల్డ్ బాక్స్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ విధంగా కూతురికి విజయం అందించడానికి మెగాస్టార్ ఏకంగా 50 కోట్లు వదులుకోవడానికి సిద్ధమైనట్లు టాలీవుడ్ సమాచారం.మరి వీరి నిర్మాణంలో మెగాస్టార్ ఎప్పుడు సినిమా చేస్తారో తెలియాల్సి ఉంది.







