చైనా స్కూల్స్ లో మెగాస్టార్ చిరంజీవి మేనియా..ఇది గిన్నిస్ రికార్డు!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కి ఉన్నటువంటి స్థానం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పేది ఏముంది, చిన్న పిల్లవాడికి కూడా తెలుసు ఆయన స్థానం గురించి.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి, కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, విలన్ రోల్స్ కూడా చేస్తూ, ఆ తర్వాత హీరో గా మారి , మెగాస్టార్ గా ఎదిగి, దాదాపుగా నాలుగు దశాబ్దాలు నెంబర్ 1 హీరో గా కొనసాగాడు.

రాజకీయాల్లో సేవ చెయ్యాలని నిస్వార్థంతో వచ్చిన ఆయనకీ రాజకీయాలు అంతగా అబ్బలేదు.ఆ తర్వాత ఆయన పదేళ్లకు టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి మూడు వంద కోట్ల షేర్ సినిమాలను కొల్లగొట్టి తన సత్తా చాటాడు.ఈ వయస్సు లో కూడా తాను కుర్ర హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ఇవ్వగలను అని నిరూపించుకున్నాడు.

అలాంటి మెగాస్టార్ చిరంజీవి పేరు ఎత్తితే అభిమానులు గర్వం తో కాలర్ ఎగరేసుకుంటారు.చిరంజీవి కి కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో అలాగే ఇతర దేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.ఆయన జీవిత చరిత్ర ని విద్యాసంస్థల్లో అప్పుడప్పుడు నిర్వహించే సెమినార్స్ లో కూడా విద్యార్థుల్లో ఉత్సాహం పెంచేందుకు, వాళ్ళలో చైతన్యం నింపేందుకు చెప్తుంటారు.

Advertisement

రీసెంట్ గా చైనా లో కూడా అదే జరిగింది.చైనా లో ఇండియన్స్ కి సంబంధించి విద్యాసంస్థల్లో సెమినర్స్ ఇవ్వడం పూర్తిగా నిషిద్ధం, అసలు ఒప్పుకోరు.కానీ చైనా రాజధాని బీజింగ్( Beijing of China ) సమీపం లో జంజోర్ 26 ప్రభుత్వం చేత నడపబడే ఒక మీడియం స్కూల్ లో జస్మితా( Jasmita ) అనే అమ్మాయి చిరంజీవి గురించి ప్రత్యేకమైన సెమినార్ తన క్లాస్ రూమ్ లో ఇచ్చింది.

తొలుత టీచర్స్ అలా ఇచ్చేందుకు ఒప్పుకోలేదు, కానీ జస్మితా చిరంజీవి గురించి గూగుల్ లో వెతికి టీచర్స్ కి చూపించింది.

ఆయన సాధించిన విజయాల గురించి మొత్తం చూసిన తర్వాత ఇలాంటి స్టోరీస్ సెమినార్ ఇవ్వడం అత్యవసరం అని చెప్పి ఆ అమ్మాయిని ప్రోత్సహించారట.అలా దేశం కానీ దేశం లో విద్యార్థులు మన మెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకున్నారు అంటే మెగా అభిమానులకు ఎంత గర్వ కారణమైన విషయమో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇది మెగాస్టార్ చిరంజీవి రేంజ్, కేవలం ఒక హిట్ / ప్లాప్ ఆయన రేంజ్ ని నిర్ణయించలేవు.ఎవ్వరూ కలలో కూడా చేరుకోలేని రేంజ్ ఆయనది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
వారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది .. కేటీఆర్ సెటైర్లు 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భింబిసారా డైరెక్టర్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.ఈ సినిమా నవంబర్ నెల నుండి ప్రారంభం కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు