ఆచార్య నీలాంబరి సాంగ్ ప్రోమో వచ్చేసింది..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా నుండి దీపావళి కానుకగా ఒక సాంగ్ రిలీజైంది.

ఈ సాంగ్ లో రాం చరణ్, పూజా హెగ్దే నటించారు.

సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తుండగా పూజా హెగ్దే నీలాంబరిగా చేస్తుంది.

Megastar Chiranjeevi Acharya Neelambhari Song Promo Released , Megastar Chiranje

సినిమాలో నీలాంబరి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు చిత్రయూనిట్.దీపావళి కానుకగా ఆచార్య నుండి ఈ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి ఆల్రెడీ లాహే సాంగ్ సూపర్ హిట్ కాగా నీలాంభరి సాంగ్ మెలోడీగా వచ్చింది.ఈ సినిమాతో మణిశర్మ మరోసారి తన మార్క్ మ్యూజిక్ అందిస్తారని చెప్పొచ్చు.2022 ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్ ఫిక్స్ చేశారు.సినిమాలో చరణ్ పాత్ర హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Advertisement

తప్పకుండా మెగా ఫ్యాన్స్ కు ఆచార్య మరచిపోలేని ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.ఓ పక్క జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ లో రామరాజుగా చరణ్ కనిపిస్తాడు.ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆచార్యలో సిద్ధ పాత్రలో మెస్మరైజ్ చేస్తాడని చెప్పొచ్చు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు