మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ బాక్సాఫీస్ పై యుద్ధం ప్రకటించినట్టుగా బ్యాక్ టు బ్యాక్ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆచార్య సినిమా ఈ నెలలో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
ఆ వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన గాడ్ఫాదర్ సినిమా ను కూడా అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో చిరంజీవి మరియు యాంకర్ శ్రీముఖి ల కాంబోలో రెండు మూడు ఆసక్తికర రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయట.ముఖ్యంగా ఖుషి సినిమా లోని భూమిక మరియు పవన్ కళ్యాణ్ నడుము సన్నివేశం ని పేరడీగా చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేశారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి మరియు శ్రీముఖి ఆ సన్నివేశం చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కాస్త ఎబ్బెట్టుగా ఉంది అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే మెజార్టీ మెగా ఫ్యాన్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం కచ్చితంగా ఆ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ కంటే అద్భుతంగా మెగాస్టార్ చిరంజీవి చేసి తనేంటో నిరూపించుకున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి మధ్య కాలం లో చేస్తున్న వరుస సినిమాల్లో కనీసం మూడు ఈ ఏడాదిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇప్పటికే రెడీగా ఉన్న ఆచార్య సినిమా తో పాటు త్వరలోనే గాడ్ఫాదర్ ఆ వెంటనే బోళా శంకర్ సినిమా చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.శ్రీముఖితో చిరంజీవి రొమాన్స్ చేస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.







