అల్లు, నందమూరి ఫ్యామిలీ వారధిగా నిలిచింది ఎవరో తెలుసా!

Mega Nandamuri Bonding Turning Stronger

నటసింహం నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘అఖండ’.వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా రాబోతున్న అఖండ పై కూడా అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు.

 Mega Nandamuri Bonding Turning Stronger-TeluguStop.com

ఇక ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ కూడా ముగించేసుకుని విడుదలకు కూడా సిద్ధం అయ్యింది. డిసెంబర్ 2న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్.

ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 27న హైదరాబాద్ శిల్పకళా వేదికలో భారీ స్థాయిలో జరగనుంది.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే గెస్ట్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

 Mega Nandamuri Bonding Turning Stronger-అల్లు, నందమూరి ఫ్యామిలీ వారధిగా నిలిచింది ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.దీంతో అసలు అల్లు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ మధ్య ఏం జరుగుతుందా అని అందరు ఆలోచిస్తున్నారు.

ఈ వేడుకకు అల్లు అర్జున్ ను ఎందుకు ముఖ్య అతిధిగా పిలిచారా అని టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.అయితే ఈ పని వెనుక వేరే సూత్ర దారి ఉన్నట్టు అతడే అల్లు ఫ్యామిలీ ని నందమూరి ఫ్యామిలీని ఒకే వేదికపైకి తీసుకు వచ్చాడని వార్తలు వస్తున్నాయి.

ఈ రెండు ఫ్యామిలీల మధ్య బోయపాటి వారధిగా నిలిచాడని చెప్పుకుంటున్నారు.అయితే అందుకు ఒక కారణం కూడా ఉంది.

ఇప్పుడు అఖండ తెరకెక్కించిన బోయపాటి గతంలో అల్లు అర్జున్ కు సరైనోడు సినిమాతో సూపర్ హిట్ అందించాడు.ఇక ఆ సినిమా తర్వాతనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది.

Telugu Akhanda, Allu Arjun, Nandamuri, Pre, Tollywood-Movie

దీంతో బోయపాటి కారణంగానే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వస్తున్నాడని ప్రచారం అయితే జరుగుతుంది.అందులోను అల్లు అరవింద్ కు సంబంధించిన ఆహా ఓటిటిలో బాలయ్య ప్రెసెంట్ టాక్ షో చేస్తుండడంతో వీరి మధ్య సాన్నిహిత్యం కూడా పెరిగింది.ఏది ఏమైనప్పటికి అల్లు అర్జున్ బాలయ్య సినిమాకు గెస్ట్ గా రావడం అందరికి ఆశ్చర్యం తో పాటు షాక్ కు కూడా గురి చేస్తుంది.అయితే అల్లు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ మధ్య స్నేహం బలపడడం తెలుగు ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తుంది.

#Akhanda #Allu Arjun #Nandamuri #Pre

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube