మెగా హిట్ మరో ఛాన్స్ తెచ్చింది..!

మెగా ఫ్యామిలీలో ఓ హిట్ కొడితే ఆ దర్శకుడికి లక్కీ ఛాన్సెస్ వస్తుంటాయి.

తాజాగా అల్లు శిరీష్ కు కెరియర్ లో మెమరబుల్ హిట్ ఇచ్చిన డైరక్టర్ పరశురాం కూడా అంతే వచ్చిన అవకాశాన్ని అన్ని విధాలుగా వినియోగించుకున్న ఈ దర్శకుడు ఫలితం శ్రీరస్తు శుభమస్తు హిట్ అందుకున్నాడు.

అల్లు శిరీష్ ను అందరికి నచ్చేలా చేసిన పరశురాం ప్రతిభ నచ్చిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఇప్పుడు ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో హీరో కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వారే అంటున్నారు.

ఆంజనేయులు, యువత, సోలో, సారొచ్చారు సినిమాలతో దర్శకుడిగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసిన పరశురాం శ్రీరస్తు శుభమస్తు హిట్ తో మెగా దర్శకుడయ్యాడు.ఇక చేయబోయే తర్వాత సినిమా కూడా హిట్ కొడితే స్టార్ డైరక్టర్ గా పరశురాం కూడా పోటీలో ఉన్నట్టే.

శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది.తన దగ్గరున్న అన్ని కథలు అల్లు అరవింద్ గారికి తెలుసని చెబుతున్న పరశురాం చూస్తుంటే మెగా కాంపౌండ్ లోనే కొంతకాలం ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి.

Advertisement
Pokiri : పోకిరి సినిమా ఎందుకు ఆడిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు

తాజా వార్తలు