అలాంటి ఫోటో షేర్ చేసిన వరుణ్.... వదినకు వంటలు రావా అన్నా అంటూ నెటిజన్స్ కామెంట్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం మనకు తెలిసిందే ఈయన గత కొంతకాలంగా నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripaathi ) తో ప్రేమలో మునిగి తేలుతున్నారని అయితే వీరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెళ్లికి అనుమతి కూడా తీసుకున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోని జూన్ 9వ తేదీ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థం ( Engagement ) ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తల గురించి ఎక్కడ మెగా ఫ్యామిలీ అధికారకంగా స్పందించిన దాఖలాలు లేవు.

 Mega Hero Varun Tej Shared A Photo Of Preparing Pizza , Varun Shared Such A Pho-TeluguStop.com

ఈ విధంగా వరుణ్ తేజ్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ మెగా ఫ్యామిలీ ( Mega Family ) స్పందించకపోవడమే కాకుండా ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నారు.ఇక వరుణ్ తేజ్ కూడా తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు ఇందులో ఆయన పిజ్జా( Pizza ) తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా గవ్వలను కూడా తయారు చేస్తున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇలా వరుణ్ తేజ్ వంటలు( Cooking ) చేస్తున్నటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అయ్యాయి.

ఇక ఈ ఫోటోలపై నేటిజెన్స్ స్పందిస్తూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఏంటి బ్రో పెళ్లికి ముందే వంటలు నేర్చుకుంటున్నావా అంటూ కొందరు కామెంట్లు చేయగా అన్న వదినకు వంటలు రావా అందుకే నువ్వే నేర్చుకుంటున్నావా అంటూ మరికొందరు ఈ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు ఈ ఫోటోలపై స్పందిస్తూ అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నా అంటూ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే వరుణ్ తేజ్ లావణ్య గురించి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందించి క్లారిటీ ఇవ్వకపోవడంతో వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube