మెగా ఫ్యామిలీ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఎవరో ఒకరు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.అయితే వారిలో ఎక్కువ శాతం మంది బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నారు.
అలాంటి సమయంలో వచ్చిన వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) ఉప్పెన సినిమా తో వంద కోట్లు సాధించి మెగా ఫ్యాన్స్ లో ఆశలు కల్పించాడు.మొదటి సినిమా తోనే వంద కోట్లు వసూళ్లు సాధించడం తో మేనమామల పోలికలు మాత్రమే కాకుండా వారికి ఉన్న అదృష్టం మరియు చార్మింగ్ ఈ హీరోకి ఉందని అంతా భావించారు.
ఉప్పెన( Uppena ) తర్వాత మరిన్ని హిట్ సినిమాలు ఆయన హీరోగా వస్తాయని అంతా భావించారు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.ఉప్పెన తర్వాత వచ్చిన కొండపొలం( Kondapolam ) మరియు రంగరంగ వైభవంగా( Ranga Ranga Vaibhavanga ) సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.ఇలాంటి సినిమాలను ఎందుకు చేస్తున్నాడు అనుకునే విధంగా వైష్ణవ్ తేజ్ వ్యవహరిస్తున్నాడు.
వైష్ణవ్ విషయం లో మెగా ఫ్యామిలీ పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి కథ విన్న తర్వాత మాత్రమే వైష్ణవ్ తేజ్ ఓకే చెప్తే బాగుంటుంది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.
మొత్తానికి వైష్ణవ్ తేజ్ తన నాల్గవ సినిమా ఆది కేశవ తో( Adikeshava ) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.మరి కొన్ని గంటల్లో విడుదల అవ్వబోతున్న ఆదికేశవ సినిమా లో శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటించింది.ఆమె నటించడం వల్ల సినిమా స్థాయి పెరిగింది.అంతే కాకుండా సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా ను నాగ వంశీ నిర్మించడం వల్ల కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి.
ఈ సినిమా తో అయినా వైష్ణవ్ తేజ్ ల యొక్క ఫ్లాప్ ల పరంపరకి ముగింపు పలుకుతాడో లేదంటే.ఫ్లాప్ లతో హ్యాట్రిక్ కొడతాడో చూడాలి.