మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) నటించిన విరూపాక్ష చిత్రం మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అంతకు ముందు వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చడంతో పాటు విరూపాక్ష చిత్రానికి పోటీగా మరే సినిమా విడుదల కాలేదు.
దాంతో ఎడారిలో ఒయాసిస్ అన్నట్లుగా ప్రేక్షకులు ఈ సమ్మర్ సీజన్ ని పండగ స్పెషల్ ని విరూపాక్ష సినిమా( Virupaksha ) తో గడిపేస్తున్నారు.అందుకే మొదటి రెండు రోజులు కూడా భారీగా కలెక్షన్స్ నమోదు అయినట్లుగా సమాచారం అందుతుంది.

మూడవ రోజైనా నేడు కూడా ఆదివారం అవ్వడం వల్ల భారీగా కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల గారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రంజాన్( Ramzan ) సెలవు కలిసి రావడంతో పాటు సమ్మర్ హాలిడేస్ వల్ల ప్రేక్షకులు విరూపాక్ష థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు.అంతే కాకుండా మెగా ఫ్యామిలీ అంతా కూడా సినిమా బాగుంది బాగుంది అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.

పైగా సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటించిన చిత్రం ఇదే అవ్వడంతో కూడా సానుభూతి కూడా కనిపిస్తుంది.మొత్తానికి విరూపాక్ష సినిమా కు చాలా విధాలుగా కలిసి వచ్చి భారీగా కలెక్షన్స్ నమోదు అవుతున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా లక్కీ బ్యూటీ, గోల్డెన్ లెగ్ సంయుక్త మీనన్( Samyukta Menon ) హీరోయిన్ గా నటించింది.
చివరిగా ఈ సినిమా కు కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే సుకుమార్ శిష్యుల్లో ఒక్కడైనా కార్తీక్ దండు( Karthik Dandu ) ఈ సినిమా ను తెరకెక్కించాడు.అంతే కాకుండా తన గురువు సుకుమార్ ని ఒక నిర్మాతగా కార్తీక్ ఈ సినిమా నిర్మాణ వ్యవహారంలో భాగస్వామ్యం చేయడం జరిగింది.
అందుకే ఈ సినిమా పట్ల పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.దానికి తగ్గట్లుగానే టాక్ రావడం తో కలెక్షన్స్ బాగా వస్తున్నాయని అంతా భావిస్తున్నారు.మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







